Simhadri Appanna: విశాఖపట్నంలోని సింహాచలం అప్పన్న స్వామి భక్తులకు పెను ప్రమాదం తప్పింది. గిరి ప్రదక్షిణ మార్గంలో తొలి పావాంచా దగ్గర నిర్మించిన రేకుల షెడ్ కూలిపోయింది. షెడ్ కింద కాంక్రీట్ బేస్ లేకపోవడం, బరువు అధికంగా ఉండటంతో, షెడ్ కిందకి కుప్పకూలింది. అదృష్టవశాత్తూ రేకుల షెడ్ కింద ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. అలాగే, ఇటీవల జరిగిన చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన ఘటన తరువాత ఇప్పుడు మరోసారి షెడ్ కూలడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తుంది.
Read Also: Telangana : ఆ డాక్టర్లకు శుభవార్త.. ఈ పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
అయితే, సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణ మార్గంలో తొలి పావంచ వద్ద రేకుల షెడ్డు కూలిన ఘటనపై ఎన్టీవీ వార్త కథనానికి అధికారులు స్పందించారు. ఈ ప్రమాదంపై అధికార యంత్రాంగం సీరియస్ అయింది. ప్రమాదకరంగా మారిన భారీ రేకుల షెడ్డులను వెంటనే తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక, సంఘటనా స్థలానికి చేరుకున్న ఈవో వి. త్రినాధరావు.. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతామని ఆలయ ఈవో, అధికారులు వెల్లడించారు.