Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏ ప్రాంతానికి వెళ్లినా.. అక్కడి ప్రజలు, ఆ ప్రాంతంతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకుంటారు.. నేను ఈ ప్రాంతంలో పెరిగాను.. ఈ ప్రాంతంలో తిరిగాను.. ఇక్కడ వీళ్లతో నాకు పరిచయం ఉంది.. అక్కడ వారితో అనుబంధం ఉంది.. ఇలా చెప్పుకొస్తారు.. అయితే, దీనిపై రాజకీయ విమర్శలు లేకపోలేదు.. పవన్ ఎక్కడికి వెళ్లినా.. నేను ఇక్కడే పెరిగాను.. ఇక్కడే తిరిగేవాడిని అని చెబుతారంటూ పలు సందర్భాల్లో వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు.. అయితే, వారికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు పవన్ కల్యాణ్.. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న పవన్ కల్యాణ్.. ఇందులో తన మొదటి గురువు సత్యానంద్‌ను స్టేజిమీద ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు స్టేజిమీద పాదాభివందనం చేశారు.
Read Also: Hari Hara Veera Mallu: మల్టీఫ్లెక్స్ ప్రీమియర్ సేల్స్ లోనూ దుమ్ము రేపుతున్న వీరమల్లు
ఆ తర్వాత పవన్ కల్యాణ్ తన గురువుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అన్నయ్య చిరంజీవి నన్ను సత్యానంద్ గారికి అప్పగించారు. ఆయన్ను నేను చాలా ఇబ్బందులు పెట్టాను. చెన్నైలో నేను ఆయన్ను చాలా ఇబ్బందులు పెట్టాను. దాంతో ఆయన నన్ను విశాఖపట్నం తీసుకొచ్చి ఇక్కడ తన టీమ్ తో చాలా స్ట్రిక్ట్ గా ట్రైనింగ్ ఇచ్చారని తెలిపారు.. ఇక, మార్నింగ్ టైం బీమిలీ.. సాయంత్రం సంగం శరత్ గెస్ట్ హౌస్‌లో ట్రైనింగ్ ఉండేది.. ఇప్పుడు ఇవి అన్నీ చెప్పాను అనుకొండి.. పవన్ కల్యాణ్.. కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగాను అంటాడు.. విశాఖ వస్తే.. విశాఖలో తిరిగాను అంటాడు.. ఏ ఊరు వెళ్ళినా.. అక్కడ నేను ఉన్నా కొన్నాళ్ళు.. అంటాడు ఏమిటో.. అని విమర్శిస్తారు.. అయితే, నా పేరు పవన్… పవనంలా పయనిస్తూ ఉంటా.. ప్రతి చోటా నేనే ఉంటా.. మనం పవనాలం అయితే.. అవి “కూపస్థ మండూకాలు” (నూతిలో ఉన్న కప్ప)ల వంటివారు.. పవనం సర్వాంతర్యామి అంటూ కౌంటర్ ఇచ్చారు పవన్ కల్యాణ్.. కాగా, పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో పవన్ చాలా బిజీగా గడుపుతున్నారు.