Minister Anitha: రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ కేంద్ర కారాగారానికి ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. ఈ సందర్భంగా యువ ఖైదీలైన 30 మందితో పాటు జైళ్లశాఖ అధికారులకు సైతం రాఖీలు కట్టింది.
తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉత్తరాంధ్ర. 2024 ఎన్నికల ఫలితాలు, ఇక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీలే అందుకు నిదర్శనం. అందులోనూ గ్రేటర్ విశాఖ సిటీలో అయితే సైకిల్ సవారీకి ఎదురే లేకుండా పోయింది. కూటమి కట్టినా...ఒంటరిగా పోటీ చేసినా సిటీ పరిధిలోని నాలుగు స్ధానాలు టీడీపీ ఖాతాలోనే పడుతున్నాయి.
నాకు పదవుల మీద ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాకు పదవులపై ఆశ లేదు.. కానీ, జనసేన కార్యకర్తగా ఉండటమే నాకు ఇష్టం అన్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డక జనసేనలో ఎటువంటి కమిటీ వేయలేదు... జనసేన సైనికులు ఓర్పుతో పార్టీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు..
విశాఖ లోని అయోధ్య రామ మందిరం నమూనా సెట్ నిర్వాహకులకు ఉచ్చు బిగుస్తుంది.. ఆధ్యాత్మిక ముసుగులో కమర్షియల్ గా నిర్వహిస్తున్న రామ మందిరం వివాదం ముదురుతుంది.. అయోధ్య రామ మందిరం నిర్వాహకులపై రెండు ఫిర్యాదులు అందుకున్నారు విశాఖ త్రీ టౌన్ పోలీసులు.. ముగ్గురు నిర్వహకులుపై 318(4) r/w 3(5) BNS కింద త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు..
మార్నింగ్ టైం బీమిలీ.. సాయంత్రం సంగం శరత్ గెస్ట్ హౌస్‌లో ట్రైనింగ్ ఉండేది.. ఇప్పుడు ఇవి అన్నీ చెప్పాను అనుకొండి.. పవన్ కల్యాణ్.. కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగాను అంటాడు.. విశాఖ వస్తే.. విశాఖలో తిరిగాను అంటాడు.. ఏ ఊరు వెళ్ళినా.. అక్కడ నేను ఉన్నా కొన్నాళ్ళు.. అంటాడు ఏమిటో.. అని విమర్శిస్తారు.. అయితే, నా పేరు పవన్... పవనంలా పయనిస్తూ ఉంటా.. ప్రతి చోటా నేనే ఉంటా.. మనం పవనాలం అయితే.. అవి "కూపస్థ మండూకాలు"…
Vizag Online Betting: విశాఖపట్నంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. బెట్టింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గోపి అనే బుకీని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. గోపితో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం, గోపి క్రికెట్ బ్రహ్మీ, గోపి క్రికెట్ అనలిస్ట్, క్లాసిక్ ప్రిడిక్షన్, జేనీ ప్రిడిక్షన్ అనే ఆరు టెలిగ్రామ్ ఛానెల్స్ ద్వారా బెట్టింగ్‌కు సంబంధించి అప్డేట్స్, ప్రిడిక్షన్లు అందిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో యువతుల న్యూడ్ వీడియోస్ రికార్డింగ్ ఘటన కలకలం రేపుతోంది. లాడ్జిలో దిగిన యువతుల న్యూడ్ వీడియోలని చిత్రీకరించారనే ఆరోపణతో.. నలుగురు యువకులను యువతులు చితకబాదారు. ఈ ఘటన విశాఖలోని ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Also Read: Crop Cultivation: తొలకరి పంటకే ఇన్ని కష్టాలైతే.. మరి రబీ పరిస్థితి ఏంటి? విశాఖలోని ద్వారకలో బాయ్స్ హాస్టల్, లాడ్జి పక్కపక్కనే ఉన్నాయి. హాస్టల్లో…
ముతుకుమిల్లి శ్రీభరత్..... తెలుగుదేశం పార్టీ యువ ఎంపీ. ఉద్దండులు గెలిచిన విశాఖ గడ్డ మీద రికార్డులు బ్రేక్ చేసిన నాయకుడు. రాజకీయ వారసత్వ పునాదుల ఆధారంగా 2019లో తొలిసారి పోటీ చేసిన శ్రీభరత్‌కు షాకింగ్ ఎక్స్పీరియన్స్ మిగిల్చారు విశాఖ ఓటర్లు. నాడు వైసీపీ ప్రభంజనం ఒకవైపు, జనసేన ఓట్లు చీలిక మరోకవైపు తీవ్ర ప్రభావం చూపి ఫస్ట్ అటెంప్ట్‌లో ఓడిపోయారాయన. అప్పట్లో... ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ గెలుపుకంటే... భరత్ ఓటమిపైనే ఎక్కువ విశ్లేషణలు నడిచాయి.…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. విశాఖ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అబ్బద్ధాలను ప్రచారం చేయడంలో ఆరి తేరిందన్నారు.. వాళ్ల భాష, పరామర్శలు రాష్ట్ర ప్రజలు అంతా చూస్తున్నారన్న ఆయన.. వేలాది మందితో వెళ్లి చేసేది పరామర్శా? లేక దండ యాత్రో.. వాళ్లే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..