Vizag Online Betting: విశాఖపట్నంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. బెట్టింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గోపి అనే బుకీని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. గోపితో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం, గోపి క్రికెట్ బ్రహ్మీ, గోపి క్రికెట్ అనలిస్ట్, క్లాసిక్ ప్రిడిక్షన్, జేనీ ప్రిడిక్షన్ అనే ఆరు టెలిగ్రామ్ ఛానెల్స్ ద్వారా బెట్టింగ్‌కు సంబంధించి అప్‌డేట్స్, ప్రిడిక్షన్లు అందిస్తూ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు ఉత్సాహం కలిగించాడు. ఈ గ్రూపులకు 10,000కి పైగా ఫాలోవర్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ టెలిగ్రామ్ ఛానెల్స్ ద్వారా ప్రతి మ్యాచ్‌కు కనీసం 300 నుంచి 500 మంది వరకు బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Tempt Power Bank: కొత్త MagSafe కంపాటిబుల్ వైర్‌లెస్ పవర్‌బ్యాంకులను విడుదల చేసిన టెంప్ట్..!
ఈ బెట్టింగ్ ముఠా కార్యకలాపాలు మామూలుగా జరగడం లేదు. గోపి తన ముఠాను కాల్ సెంటర్ మాదిరిగా ఏర్పాటు చేసి, సమర్థవంతంగా బెట్టింగ్ నిర్వహణ చేపట్టినట్టు తెలిసింది. ఇందులో పని చేసే వ్యక్తులు కస్టమర్లకు సూచనలు, లైవ్ అప్‌డేట్లు, ప్రిడిక్షన్లు అందిస్తూ బెట్టింగ్‌ను ప్రోత్సహించారు. గోపి వద్ద 20 బ్యాంక్ ఖాతాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీటిలో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఖాతాలన్నింటిని పోలీసులు ట్రాక్ చేస్తూ, ముడుపుల మూలాలను వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు.
Mumbai Local Train Blast: 19 ఏళ్ల తరువాత 12 మంది నిర్దోషులుగా విడుదల చేసిన బాంబే హైకోర్టు