విశాఖ సాగర తీరంలో మరో యుద్ధ నౌక ఆవిష్కృతం కానుంది. తూర్పు నావికాదళం అమ్ముల పొదిలో ఐఎన్ఎస్ నిస్తార్ యుద్ధ నౌక చేరనుంది. సముద్రంలో గస్తీ, పరిశోధన, రక్షణ కార్యకలాపాలకు కీలకమైన సేవలను నిస్తార్ అందించనుంది. ఆపదలో చిక్కుకున్న జలాంతర్గాములకు సహకారం అందించే సామర్థ్యం నిస్తార్ సొంతం కానుంది. 80 శాతం దేశీయ పరిజ్ఞానంతో ఈ యుద్ధ నౌకను హిందూస్తాన్ షిప్ యార్డ్ తయారు చేసింది. నిస్తార్ ప్రాజెక్ట్ వ్యయం రూ.2396 కోట్లు కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Coldplay Concert: సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ హెచ్ఆర్ హెడ్ తో గుట్టుగా ప్రేమాయణం!.. కోల్డ్‌ప్లే కచేరీలో దొరికిపోయారు
శుక్రవారం విశాఖపట్నంలో జాతికి అంకితం చేసేందుకు తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేక డైవింగ్ టీమ్, బహుళపక్ష వినియోగ డెక్‌లు, హెలికాప్టర్ కలిగి ఉండటం ఐఎన్‌ఎస్ నిస్తార్ ప్రత్యేకతలు. హిందుస్థాన్ షిప్ యార్డులో నిర్మించిన ఈ నౌక 10,500 టన్నుల బరువు, 120 మీటర్ల పొడవు ఉంటుంది. పూర్తి రిమోట్ ఆధారంగా పని చేయనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, భారత నేవీ అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి రానున్నారు.
ఇది కూడా చదవండి: Trump: పాకిస్థాన్‌లో ట్రంప్ పర్యటన వార్తలపై స్పందించిన వైట్‌హౌస్