Vishaka Drugs Case:తీగ లాగితె డొంకంతా కదిలినట్టు.. ఇప్పుడు డ్రగ్స్ కేసులో తీగ లాగితే డ్రగ్స్ దందా మొత్తం బయటకు వస్తుంది.. విశాఖపట్నం డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ల సంఖ్య పెరిగిపోతోంది.. ఈ కేసులో దూకుడు పెంచిన పోలీసులు.. తాజాగా ఓ డాక్టర్ ను అరెస్ట్ చేశారు.. డాక్టర్ కృష్ణ చైతన్య వర్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.. డ్రగ్స్ కొనుగోలు చేసి వినియోగించారా..? లేదా ఇంకా ఎవరికైనా విక్రయించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.. డ్రగ్స్ కేసులో మొదటిగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు విశాఖ త్రీ టౌన్ పోలీసులు.. అయితే, శనివారం నాటికి ఐదుగురులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు చూపించారు.. అక్షయ్ కుమార్ అలియాస్ మున్న, దక్షిణ ఆఫ్రికాకి చెందిన థామస్ ను అరెస్టు చేసినట్టు శనివారం నాటికి ప్రకటించారు పోలీసులు.. మిగిలిన ముగ్గురు అనుమానితులుగా పేర్కొన్నారు.. తాజాగా ఈ కేసులో డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య వర్మని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.. డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య వర్మ రూ. 65 వేలతో డ్రగ్స్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు.. డ్రగ్స్ లింక్స్ పై దృష్టి పెట్టారు పోలీసులు..
Read Also: Mahesh Babu: మహేశ్ బాబుని నిందితుడిగా చేరుస్తూ.. నోటీసులు జారీ!