Ganja Cultivation in Vizag: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ విషయంలో సీరియస్‌గా ఉంది.. ఓ వైపు డ్రగ్స్, గంజాయి అరికట్టేందుకు చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు, గంజాయి సాగు లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.. అయితే, విశాఖ నగర నడిబొడ్డున గంజాయి సాగు కలకలం సృష్టించింది.. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జ్ఞానాపురం రాస వీధి సమీపంలోని ఓ పాడు బడ్డ ఇంటి దగ్గర ఖాళీ ప్రదేశంలో కొన్ని మొక్కలు ఏపుగా పెరిగాయి. అయితే, అవి గంజాయి మొక్కలను పోలినట్టే ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సుమారు 15 మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.. గంజాయి నిర్ధారణ కోసం ల్యాబ్ కు పంపించారు.. అయితే, గతంలో, కొంతమంది గంజాయి సేవించే బ్యాచ్ ఈ ప్రాంతానికి వచ్చి గంజాయి సేవిస్తున్న సమయంలో మిగిలిన వాటిని పడేయడంతో ఈ మధ్య కురిసిన వర్షాలకి మొక్కలు మొలిచాయని స్థానికులు భావిస్తున్నారు.. మరోవైపు, విశాఖ నడిబొడ్డున్న కలకలం రేపిన ఈ గంజాయి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు..
Read Also: WAR 2 : వార్ 2 US ప్రీమియర్స్.. యంగ్ టైగర్ ఊచకోత చూస్తారు