Laureus World Team of the Year: భారత మహిళల జట్టు సంచలనం.. ఆ గ్లోబల్ అవార్డ్కు నామినేషన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Laureus World Team of the Year: భారత మహిళల జట్టు గతః ఏడాది నవంబరులో సాధించిన చారిత్రాత్మక విజయానికి ప్రపంచ వేదికపై అరుదైన గౌరవానికి నామినేషన్ లభించింది. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026లో ‘వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్’ విభాగానికి భారత మహిళల జట్టు ఈసారి నామినేట్ అయ్యింది. నామినేషన్లను మంగళవారం నాడు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో ప్రకటించగా.. విజేతలను లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అకాడమీ ఎంపిక చేసి ఏప్రిల్ 20న జరిగే గాలా వేడుకలో ప్రకటించనున్నారు. ఈ వేడుక “సిబెల్స్ ప్యాలస్”లో వైభవంగా జరుగనుంది.
Jowar Khichdi Recipe: మధుమేహం, అధిక బరువుకు చెక్.. జొన్న కిచిడీతో ఆరోగ్యానికి కొత్త దారి!
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు భారత్‌తో పాటు ఈ జట్లు కూడా నామినేట్ అయ్యాయి:
* Paris Saint-Germain (ఫుట్‌బాల్ – ఫ్రాన్స్)
* McLaren Formula 1 Team (ఫార్ములా 1 – యూకే)
* European Ryder Cup Team (గోల్ఫ్ – యూరప్)
* England women’s national football team (ఫుట్‌బాల్ – యూకే)
* Oklahoma City Thunder (బాస్కెట్‌బాల్ – యూఎస్ఏ)
ఈ అరుదైన నామినేషన్ సంబంధించి బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ మాట్లాడుతూ.. “ఈ నామినేషన్ భారత క్రికెట్‌కు అపార గౌరవం. మా మహిళల జట్టు అసాధారణ నైపుణ్యం, ధైర్యం, స్థిరత్వం ప్రదర్శించి 2025లో చరిత్ర సృష్టించిందని.. ప్రపంచ క్రీడల్లో అగ్ర జట్ల సరసన నిలవడం వారి కృషికి గొప్ప గుర్తింపని అన్నారు.
ఇకపోతే 2025 మహిళల వరల్డ్ కప్‌లో భారత్ ప్రయాణం రోలర్ కోస్టర్‌లా సాగిందని చెప్పాలి. టోర్నీ మొదట్లో శ్రీలంకపై 59 పరుగుల విజయం, ఆపై పాకిస్తాన్ మీద 88 పరుగుల తేడాతో గెలుపులు లభించినా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల చేతిలో వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్థితులలో మంచి ఆరంభాలు అందించిన ప్రతీక రవాల్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకోవడం జట్టుకు పెద్ద షాక్‌గా మారింది. ఆమె స్థానంలో షఫాలి వర్మను జట్టులోకి తీసుకున్నారు.
Virosh : అభిమానులతో కలిసి భోజనం చేసిన ‘విరోష్’.. విజయ్-రష్మికల సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!
ఇక సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై రికార్డు లక్ష్యాన్ని చేధించిన భారత్, ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలి వరల్డ్ కప్ కిరీటాన్ని ముద్దాడింది. నవి ముంబైలోని DY పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో షఫాలి వర్మ 87 పరుగులు, రెండు వికెట్లు సాధించగా.. దీప్తి శర్మ 58 పరుగులతో పాటు ఐదు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశారు. ఈ విజయం దేశవ్యాప్తంగా సంబరాలను చేసుకొనేలా చేసింది. దీనితో మహిళా క్రికెట్‌పై ఆసక్తి మరింతగా పెరిగింది.
తాజావార్తలు
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!