విశాఖలో ఓ ప్రేమజంట నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టింది. పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అంటూ నిరుద్యోగులను నమ్మించి వారి దగ్గరి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. నకిలీ పోలీస్ అవతారమెత్తి.. తాము పోలీసులమంటూ నమ్మబలికారు. దీంతో పోలీస్ శాఖలో ఉద్యోగాలు అనగానే.. నిరుద్యోగులు వారికి భారీ ఎత్తున ముట్టజెప్పారు. ఇదే అదునుగా భావించిన నకిలీ పోలీసులు 30 మంది నుంచి రూ.3 కోట్లు వసూలు చేసింది.
నేడు సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును(నం.20834) అధికారులు రద్దు చేశారు. సాంకేతిక లోపం వల్ల ఆ రైలు రద్దు చేయబడింది. ఇందులోని ప్రయాణీకులందరికీ పూర్తి ఛార్జీ వాపసు చేయబడుతుందని అధికారులు ప్రకటించారు.
విశాఖలోని ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భారీ కంటైనర్ పట్టుబడింది. ఈరోజు ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాసలో వేకువజామున ఒక కంటైనర్ గంజాయి లోడుతో వెళ్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఈబీ పోలీసులు తనిఖీలు చేపట్టారు.
Visakha MP Seat Competition in BJP: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ దేశవ్యాప్తంగా రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎలెక్షన్స్ కూడా ఉన్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. కొన్నిచోట్ల సీట్ కోసం కీలక నేతలు కన్నేశారు. అందులో ఒకటి విశాఖ సీట్. ఈ సీట్ కోసం బీజేపీలో రోజురోజుకి పోటీ పెరుగుతోంది. విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు బీజేపీ ఎంపీ సీఎం…
ఈనెల 5, 7వ తేదీల్లో సీఎం జగన్ (CM Jagan) ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తెలిపారు. విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో నిర్మించనున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ(ఐఐపీఈ-పెట్రోలియం యూనివర్సిటీ) భవన సముదాయ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ నేడు వర్చువల్‌గా భూమిపూజ చేయనున్నారు.
విశాఖలో కాపు ఉద్యమ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన కాపు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. విశాఖ జిల్లా కాపునాడు అధ్యక్షులు తోట రాజీవ్ మాట్లాడుతూ, కాపులకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాపు జాతి కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసామని.. ఎన్నికల సమయంలో తమ ఓట్లు మీకు కావాలి కాబట్టి తమ ఇబ్బందులు గుర్తించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను కోల్డ్…