తాజాగా ఓ మసాజ్ సెంటర్‌లో అభ్యంతరకరమైన స్థితిలో యువతులతో కలిసి ఉన్న ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ పోలీసుల ఆకస్మిక దాడుల్లో పట్టుబడడం విశాఖపట్నం నగరంలో చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున్న స్పాల సెంటర్ లలో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు, అలాగే కొన్ని చోట్ల అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో నగర సీపీ రవిశంకర్ అయ్యన్నార్ బుధవారం రాత్రి సమయంలో ఆకస్మిక సోదాలు నిర్వహించాలని తన పోలీస్ సిబ్బందికి ఆదేశించారు. దీనితో విశాఖపట్నం నగరంలోని 64 మసాజ్/స్పా సెంటర్లను ఏకంగా 200 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి అన్ని చోట్ల సోదాలు నిర్వహించారు.
Also Read: Yadadri Temple: యాదాద్రి ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ రామకృష్ణరావుపై బదిలీ వేటు అందుకేనా..?!
ఈ దాడులలో 4 మసాజ్ సెంటర్లలో మగవారికి యువతులతో మసాజ్ చేయిస్తుండడం, అలాగే కొన్ని చోట్ల మహిళలు అభ్యంతరకరమైన రీతిలో మరికొందరు కనిపించడంతో పోలీసులు ఆ సెంటర్లపై కేసులు నమోదుచేశారు. ఇందులో భాగంగా మొత్తం 7 మంది పురుషులను అరెస్టు చేశారు. వీరితోపాటు ఈశాన్య రాష్ట్రాల నుండి వచ్చి ఈ పనిచేస్తున్న 17 మంది యువతులను స్వధార్ హోమ్ కు పోలీసులు అప్పగించారు. ఈ దాడుల్లో పోలీసులు నాలుగు మసాజ్ సెంటర్ల పై కేసు నమోదు చేసారు. అవి కూడా జోన్ -2 పరిధిలో ఉండడం గమనార్హం. అలాగే జోన్ -1 పరిధిలో ఉన్న 60 వరకూ మసాజ్ సెంటర్లు ఉన్న అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంపై పోలీస్ వర్గాల్లో సైతం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Tenth Exams: టెన్త్ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రశ్నా పత్రానికి క్యూఆర్ కోడ్..!
ఇక అసలు విష్యం ఏమిటంటే.. కంచరపాలెం స్టేషన్ పరిధిలో ఉన్న ఓ మసాజ్ సెంటర్ లో సోదాలు నిర్వహించిన పోలీసులకు అభ్యంతరకరమైన రీతిలో ఒకరు పట్టుబడ్డారు. ఈ విషయంపై అతడిని విచారించగా తాను నగర పోలీస్ కమిషనరేట్ లో ఉన్న కంట్రోల్ రూమ్ లో ఎస్‌ఐగా పనిచేస్తున్నట్టు ఆయన వెల్లడించాడు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు ఆరా తీయగా ఆయన 2014 బ్యాచ్ కు చెందిన ఎస్‌ఐగా నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. అధికారుల ఆదేశాల మేరకు ఆ ఎస్ఐ పై కూడా విటుడిగా కేసు నమోదుచేశారు.