CM Revanth Reddy Vizag Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. విశాఖలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.. తొలిసారి ఏపీ వేదికగా రేవంత్‌రెడ్డి ఎలాంటి కామెంట్లు చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. ఈ రోజు విశాఖలో పర్యటించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ – వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.. సాయంత్రం స్టీల్‌ప్లాంట్ గ్రౌండ్స్ లో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.. ఈ సభావేదికగా సేవ్ వైజాగ్ – సేవ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ విడుదల చేయనున్నారు.
Read Also: Lok Sabha Election 2024 : ఎన్నికల తేదీలు వెలువడిన వెంటనే వేటిపై నిషేధం విధిస్తారంటే ?
అయితే, వైజాగ్ సభలో రేవంత్ రెడ్డి ఏం కామెంట్ల చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.. స్టీల్‌ప్లాంట్ ను ప్రైవేటీకరణకు పూనుకున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను.. ఆ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తన గురువైన మాజీ సీఎం చంద్రబాబుపై రేవంత్‌రెడ్డి ఎలాంటి విమర్శలు చేస్తారు అనేది చర్చగా మారింది.. టీడీపీని వీడినా.. అంతకు ముందు ఎప్పుడూ చంద్రబాబును విమర్శించలేదు రేవంత్‌రెడ్డి.. ఇక, టీడీపీకి బీజేపీతో పొత్తుకుదుర్చానంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏ విధంగా విమర్శిస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.