ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విశాఖలో సముద్రంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. నిన్న సాయంత్రం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. వైజాగ్ హార్బర్ నుంచి V1-MO -2736 నెంబర్ గల బోట్ లో వేటకు వెళ్లినట్లు తెలుస్తోంది. హార్బర్ నుంచి దక్షిణ దిశగా గంగవరం వైపు వేటకు వెళ్లారు మత్య్సకారులు. అయితే వారి ఆచూకీ తెలియకపోవడంతో ఫిషింగ్ బోట్లు, కోస్ట్ గార్డ్ సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఏపీలో పెను ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై పూర్తి వివరాలను సీబీఐ ఎఫ్ఐఆర్తో పాటు ఓ నివేదిక రూపంలో పొందుపరిచింది. సంధ్య ఆక్వా చిరునామాతో బ్రెజిల్ నుంచి విశాఖ చేరిన ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ నుంచి 49 నమూనాల్ని పరీక్షించగా 48 నమూనాల్లో కొకైన్, మెథక్వలోన్ వంటి మాదక ద్రవ్యాలున్నట్లు తేలింది.
విశాఖ డ్రగ్స్ కేసులో సంధ్య ఆక్వా పరిశ్రమలకు సంబంధం ఉందని నేపథ్యంలో మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమను రెండు రోజుల పాటు సీబీఐ దాడులు నిర్వహించిన విషయం తెలిందే.. అంతా సజావుగా ఉంది అనుకునే సమయంలో కొత్త మూలపేట ఎస్ఈజెడ్ కాలనీలో సంధ్య ఆక్వాకు చెందిన బస్సు కొన్ని రోజులుగా నిలిపివేసి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ లకు ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) శనివారం ప్రకటించింది. ఫ్రాంచైజీ యాజమాన్యం చుట్టూ పెరుగుతున్న నిరీక్షణల మధ్య ఈ వార్త వచ్చింది. వైజాగ్ లో జరగబోతున్న మ్యాచ్ లకి సంబంధించి క్రికెట్ అభిమానులు రెండు మ్యాచ్ ల కోసం కోసం టికెట్స్ పొందవచ్చు. ఇందులో మొదటగా ఏప్రిల్ 3న కోల్కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)తో…
Delhi Capitals Players Reach Vizag for IPL 2924: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో మూడు రోజుల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సొంత మైదానాల్లో సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ కాపిటల్స్ టీమ్ సభ్యులు కొందరు సోమవారం విశాఖకు చేరుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆటగాళ్లు.. రోడ్డు మార్గాన రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్కి వెళ్లారు. డీసీ క్రికెట్ డైరెక్టర్…
సినీ హీరోలు, హీరోయిన్లు సినిమాలతో పాటుగా బిజినెస్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి అనే సామెతను సినీ స్టార్స్ గట్టిగానే ఫాలో అవుతున్నారు.. అందుకే చాలా మంది పలు బిజినెస్ లు చేస్తున్నారు.. అందులో అల్లు అర్జున్ కూడా ఒకరు.. ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా మరోవైపు సొంతంగా వ్యాపారాలు, వాణిజ్య ప్రకటనలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నగరాల్లో మల్టీఫ్లెక్స్ లను నిర్మిస్తున్నారు..…
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ పార్టీ నుంచి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నాయకులు ఫ్యాన్ పార్టీలోకి భారీగా వస్తున్నారు. తాజాగా, తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి విశాఖపట్నంకు చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు చేరారు.