విశాఖలో ఓ ప్రేమజంట నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టింది. పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అంటూ నిరుద్యోగులను నమ్మించి వారి దగ్గరి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. నకిలీ పోలీస్ అవతారమెత్తి.. తాము పోలీసులమంటూ నమ్మబలికారు. దీంతో పోలీస్ శాఖలో ఉద్యోగాలు అనగానే.. నిరుద్యోగులు వారికి భారీ ఎత్తున ముట్టజెప్పారు. ఇదే అదునుగా భావించిన నకిలీ పోలీసులు 30 మంది నుంచి రూ.3 కోట్లు వసూలు చేసింది.
Read Also: Congress: నేడు తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల..
ఆ తర్వాత బాధితులు మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ ప్రేమజంట కోసమని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టగా హైదరాబాద్ లో పట్టుబడ్డారు. అనంతరం వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Tamil Nadu: తమిళనాట ఖరారైన డీఎంకే పొత్తు.. స్టాలిన్‌తో మిత్రపక్షాలు భేటీ..