రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి విశాఖలోనే పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో పవన్ వరుస భేటీలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. నాగబాబు పోటీపై ఈ పర్యటనలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇకపోతే.. అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం, విశాఖల నుంచి జనసేన సీట్లు ఆశిస్తుంది. అంతేకాకుండా.. భీమిలీ, యలమంచిలి, చొడవరం, పెందుర్తి, గాజువాక స్థానాలపై జనసేన కన్ను పడింది.
విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు NAFC యూనిట్ లో మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ కమ్మేసింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు.. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎంవీవీ, వంశీ మధ్య వివా దం కొత్తది కాకపోయినా బహిరంగంగా ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. సిట్టింగ్ ఎంపీపై ఎమ్మెల్సీ ప్రయోగించిన భాష చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ఎమ్మెల్సీ వంశీ తీవ్రపదజాలంపై ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని ఎంవీపీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను అవమానించినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఎంవీవీ.
ఉమ్మడి రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ కొంత కాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది మా ఆలోచనగా పేర్కొన్నారు.. ఎన్నికల తర్వత ముఖ్యమంత్రి, పార్టీ నాయకత్వం దీనిపై చర్చించి ఆలోచిస్తారన్న ఆయన.. రాజధాని కట్టే అవకాశం ఉన్నా.. ఐదేళ్లు తాత్కాలిక పేరుతో టీడీపీ కాలయాపన చేసింది.. రాజధానికి కట్టే ఆర్థిక వనరులు లేక.. విశాఖ రాజధానిగా ఏర్పాటు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయన్నారు.
విశాఖ అభివృద్ధి చెందిన నగరంగా నీతి ఆయోగ్ రోడ్డు మ్యాప్ లో విశాఖకు స్థానం లభించిందని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ తెలిపారు. విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు రాబోతున్నాయని.. గ్రోత్ హబ్ గా మారుతుందన్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. ఈనెల 15న వైజాగ్ లో నీతి ఆయోగ్ సమావేశం జరగనుందని చెప్పారు. ఇదిలా ఉంటే.. దేశ ప్రజలు మరోసారి మోదీ సర్కార్ కోరుకుంటున్నారని.. 404 సీట్లతో మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని జీవీఎల్ చెప్పారు.
ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలుచేశారు మంత్రి రాంబాబు.. ప్రస్తుతానికి ఏపీకి రాజధాని అమరావతే అని స్పష్టం చేసిన ఆయన.. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు.