విశాఖ ఆర్కే బీచ్లో పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. నిన్న ఆర్కే బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభించారు. అయితే.. అది తెగిపోయింది. కాగా.. ఫ్లోటింగ్ బ్రిడ్జి చివరి ఫ్లాట్ ఫామ్ భాగం సముద్రంలోకి 100 మీటర్లు దూరం కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మరోవైపు.. పర్యాటకులు ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడంతో ఎక్కాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే.. ఫ్లోటింగ్ బ్రిడ్జిని నిన్న ఆర్కే బీచ్లో అట్టహాసంగా రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి…
ఏపీ సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ విశాఖ శ్రీశారదా పీఠాన్ని సందర్శించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో 11.20 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చినముషిడివాడలోని శ్రీశారదా పీఠానికి 11.40 గంటల వరకు చేరుకుంటారు.
విశాఖపట్నంలో నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి జోరుగా సాగుతుంది. తాజాగా, నగరంలో బ్లాక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు అయింది. నకిలీ కరెన్సీ చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్ల కాగితలను కరెన్సీ నోట్లుగా మారుస్తామంటూ మోసం చేశారు. బ్లాక్ కరెన్సీ ముఠాను టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మన కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది అని స్పష్టం చేశారు..
నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్కల్యాణ్ పర్యటించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో వేర్వేరుగా భేటీ కానున్నారు. టికెట్ ఆశావహులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మూడు పార్టీల పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటులో ఆశించిన వాళ్ళందరికీ అవకాశం రాకపోవచ్చనే విషయం చెప్పే ఛాన్స్ ఉంది.
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు విశాఖ నుంచి పోటీ చేస్తానని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు.. రాబోయే ఎన్నికల్లో మూడురోజులు పోలింగ్ జరపాలని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెబ్ సైట్స్ లో పొందు పరచాలని సుప్రీమ్ తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు పోలింగ్ శాతాన్ని నియంత్రిస్తున్న విధానాన్ని జై భారత్ నేషనల్ పార్టీ అడ్డుకుంటుందని అన్నారు.