రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాంధ్ర, విశాఖ వనరులు, అవకాశాలను అప్పటి ప్రభుత్వం ధ్వంసం చేసిందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఆలస్యం అయినా పరిపాలన విశాఖ నుంచే ప్రారంభిస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటన ఇన్వెస్టర్లను ఆకర్షించిందని తెలిపారు. విశాఖ పరిపాలన రాజధానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.
మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం జగన్ సున్నా వడ్డీతోని ప్రతి అక్కచెల్లమ్మలకు లక్షలాది రూపాయలను అందించారు.. వీటితో పాటు చేయూత, ఆసరా, కాపూ నేస్తంతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మేర తోడుగా అన్నతమ్ముడిలాగా ఈ నాలుగు సంవత్సరాల 10 నెలల కాలంలో సీఎం జగన్ ఒక్కరికి 90 వేల రూపాయలను నేరుగా వారి అకౌంట్లోకి వేశారని తెలిపారు.
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ లో గల్లంతైన యువకుడు మృతదేహం లభ్యం అయింది. స్నేహితులతో సరదాగా గడిపేందుకు రుషికొండ బీచ్‌కు వచ్చిన యువకుడు నిన్న గల్లంతయ్యాడు.
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు విశాఖను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. వచ్చేది పాల్ ప్రభుత్వమే... అధికారంలోకి రాగానే విశాఖను ఇంటర్నేషనల్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు.
ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విశాఖలో సముద్రంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. నిన్న సాయంత్రం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. వైజాగ్ హార్బర్ నుంచి V1-MO -2736 నెంబర్ గల బోట్ లో వేటకు వెళ్లినట్లు తెలుస్తోంది. హార్బర్ నుంచి దక్షిణ దిశగా గంగవరం వైపు వేటకు వెళ్లారు మత్య్సకారులు. అయితే వారి ఆచూకీ తెలియకపోవడంతో ఫిషింగ్ బోట్లు, కోస్ట్ గార్డ్ సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఏపీలో పెను ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై పూర్తి వివరాలను సీబీఐ ఎఫ్ఐఆర్తో పాటు ఓ నివేదిక రూపంలో పొందుపరిచింది. సంధ్య ఆక్వా చిరునామాతో బ్రెజిల్ నుంచి విశాఖ చేరిన ఇన్‌యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ నుంచి 49 నమూనాల్ని పరీక్షించగా 48 నమూనాల్లో కొకైన్, మెథక్వలోన్ వంటి మాదక ద్రవ్యాలున్నట్లు తేలింది.