సినీ హీరోలు, హీరోయిన్లు సినిమాలతో పాటుగా బిజినెస్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి అనే సామెతను సినీ స్టార్స్ గట్టిగానే ఫాలో అవుతున్నారు.. అందుకే చాలా మంది పలు బిజినెస్ లు చేస్తున్నారు.. అందులో అల్లు అర్జున్ కూడా ఒకరు.. ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా మరోవైపు సొంతంగా వ్యాపారాలు, వాణిజ్య ప్రకటనలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నగరాల్లో మల్టీఫ్లెక్స్ లను నిర్మిస్తున్నారు..
ప్రస్తుతం మల్టీప్లెక్స్ లకు డిమాండ్ బాగా ఉండటంతో వీటినుంచి ఆదాయం కూడా అదే రేంజ్ లో వస్తుంది. ఈ క్రమంలో మిగిలిన అగ్ర హీరోల దృష్టి కూడా మల్టీప్లెక్స్ లపై పడుతుంది. తాజాగా అల్లు అర్జున్ కూడా ఏపీలో మల్టీఫ్లెక్స్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నాడు.. వైజాగ్ లో మల్టీ ఫ్లెక్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు.. ఇకపోతే వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన త్వరలో జరగబోతోంది. ఇక ఈ మాల్ ను అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్తో కలిసి తన బ్రాండ్ AAA సినిమాస్ ను స్టార్ట్ చేయబోతున్నారు.. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు..
ఇటీవల సినిమా షూటింగ్ కోసం అల్లు అర్జున్ వైజాగ్ కు వచ్చిన సంగతి తెలిసిందే.. అభిమానులు ఘన స్వాగతం పలికారు.. భారీ ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అందువల్లే అక్కడ మల్టీఫ్లెక్స్ ను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు.. ఈ సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..