డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షన్నర వరకు సొమ్ములు తీసుకుని కంబోడియాకు తీసుకెళ్లిన యువకులను ఇండియన్ ఎంబసీ సమన్వయం తో విశాఖకు తీసుకొచ్చినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యనార్ వెల్లడించారు. బాధితులు ఇంటికి చేరుకోవడానికి పోలీసు శాఖ పని చేస్తోందని తెలిపారు. కమిషనర్ వివరాల ప్రకారం.. అక్కడ వాళ్ళు వీరిని చైనా వారికి అప్పగించారు. వీరి ద్వారా ఇండియా లో సైబర్ క్రైమ్ కు పాల్పడేలా చేశారు. ఒక్క సైబర్ క్రైమ్ ద్వారా విశాఖలో రూ.120 కోట్లు పోయాయి. నిన్న ఓక్కరోజే రూ.3.20 కోట్లు దోచేశారు. 20 మందితో 7 బృందాలు ఏర్పాటు చేశారు. అన్ని ఆంశాల మీద క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం అని చెప్పి తీసుకుని వెళ్లారు. ఇండియన్ లను మోసం చేస్తేనే ఆహారం ఇచ్చారు. టార్కెట్ రీచ్ అయితే పార్టీలు ఇచ్చేవారు. టార్గెట్ రీచ్ కాకపోయాన మోసాలు సరిగ్గా చెయ్యకపోయిన బేస్ బాల్ బ్యాట్లతో కొట్టారు. ఎన్ ఐ ఏ లో పని చేసిన అనుభవం కేస్ దర్యాప్తునకు సహాయపడింది.
READ MORE: Remal cyclone: బెంగాల్ వైపు దూసుకొస్తున్న తుఫాన్.. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అలర్ట్
బాధితులు ఆరు నెలలు నుంచి కంబోడియా లో ఉన్నారని కమిషనర్ రవి శంకర్ తెలిపారు. “మన రాష్ట్రం నుంచి 150 పైగా బాదితులు లెక్క తేలింది. కంబోడియా ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చక్కగా పని చేసాయి. ఈ తరహా బాధితులు ఇంకా ఎవ్వరైనా ఉన్నారా అని విచారణ జరుపుతున్నాము. ఉద్యోగం ఆశ చూపించి మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు ఇటీవల విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్పట్టుకున్నారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఏపీ నుంచి దాదాపు 150 మందికి పైగా తరలించినట్టు తేల్చారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా గుట్టు రట్టైంది.