Vijayasai Reddy: నెల్లూరు లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. స్థానిక టీడీపీ నేతల నుంచి చంద్రబాబు నాయుడు వరకూ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. విశాఖపట్నంలో భూములు ఆక్రమించారని నాపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని తెలిపారు. అయితే, నేను శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడిని.. ఆ దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నేను ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు.. నా చదువు పూర్తయిన తర్వాత నన్న ఆడిటర్ చేసిన వైఎస్ రాజారెడ్డి రుణం తీర్చుకోలేనిది అన్నారు.. వైఎస్ కుటుంబానికి నమ్మకస్తుడిగా ఉండాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను.. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఇలాంటి అవకాశం రావడం నా అదృష్టంగా పేర్కొన్నారు.
Read Also: Harish Rao: రఘునందన్ రావు ఫేక్ వీడియోలు చేయిస్తున్నారు.. హరీష్ రావు ఆరోపణ
ఇక, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహంచేసి తెలుగుదేశం పార్టీలో చేరారు అని మండిపడ్డారు సాయిరెడ్డి.. కోటంరెడ్డి ప్రజాసేవ మరిచి దందాలకు అలవాటు పడ్డారని ఆరోపించిన ఆయన.. ప్రభుత్వ అధికారిణిపై దౌర్జన్యానికి పాల్పడితే అప్పట్లో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చట్టపరమైన చర్యలకు ఆదేశించారని తెలిపారు.. కోటంరెడ్డి లాంటివారికి ఓటేస్తే ప్రశాంతత ఉండదు అని హెచ్చరించారు నెల్లూరు లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. కాగా, సాయిరెడ్డిపై భూ ఆక్రమణలపై టీడీపీ, జనసేన, బీజేపీ ఆరోపణలు చేస్తూ వస్తుండగా.. ఈ రోజు వారికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి.