విశాఖ సెంట్రల్ జైలును ఏపీ హోమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. గంజాయి కేసులో జైలులో ఉన్న గంజాయి ఖైదీలను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెంట్రల్ జైల్లో సిబ్బందికి కనీస వసతలు లేవు.. చిన్న, చిన్న పిల్లలు గంజాయి కేసుల్లో ఖైదీలగా ఉన్నారు.
విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సందడి ప్రారంభమైంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, విశాఖ ఎంపీ భరత్ హాజరయ్యారు.
విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పై ప్రజా తీర్పు కచ్చితంగా రిఫరెండమే అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై స్పందించారు.. అయితే, మూడు రాజధానులు అని ప్రకటించినా.. అమరావతికి మేం ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అమరావతితో పాటు వైజాగ్ నగరం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి…
ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల్లో ఓటమిపై పార్టీలో సుదీర్ఘంగా చర్చ జరగాలన్నారు. అడగకుండానే అన్నీ ఇచ్చినా.. ఎందుకు ప్రజల ఆదరణ లభించ లేదో తేల్చుకోవాలన్నారు. వ్యవస్థల్లో తెచ్చిన మార్పులు, సంస్కరణల కారణంగా పార్టీ కేడర్ కు గౌరవం దక్క లేదు.. నాయకత్వం, కేడర్ ను నిర్లక్ష్యం చేయాలనే ఉద్దేశం లేకపోయినా.. ప్రభుత్వం - పార్టీ మధ్య దూరం పెరిగిందన్నారు.
విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కు త్వరలో లీగల్ నోటీసులు ఇవ్వనున్నారు. మూర్తి యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్. జవహర్ రెడ్డిపై రెండు రోజులుగా అసత్య, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో త్వరలో కార్పొరేటర్ మూర్తి యాదవ్కు లీగల్ నోటీసు జారీ చేయనున్నారు. శనివారం విశాఖపట్నంలో కార్పొరేటర్ మూర్తి యాదవ్ సిఎస్ జవహర్ రెడ్డి వారిపై చేసిన అసత్యమైన, నిరాధార ఆరోపణలు వాస్తవం కాదని ఇప్పటికే ఖండిస్తూ పత్రికా ముఖంగా స్టేట్మెంట్/రిజాయిండర్…
కంబోడియాలో చిక్కుకున్న విశాఖ వాసులకు విముక్తి కల్పించేందుకు చేపట్టిన ఆపరేషన్ కంబోడియా కొనసాగుతోంది. మొదటి రోజు 25 మందికి విశాఖ పోలీసులు విముక్తి కలిగించారు. కంబోడియాలో విశాఖకు చెందిన మొత్తం 58 మంది యువకులు చిక్కుకున్నారు.