Gudivada Amarnath: ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. ఇక, ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల్లో ఓటమిపై పార్టీలో సుదీర్ఘంగా చర్చ జరగాలన్నారు. అడగకుండానే అన్నీ ఇచ్చినా.. ఎందుకు ప్రజల ఆదరణ లభించ లేదో తేల్చుకోవాలన్నారు. వ్యవస్థల్లో తెచ్చిన మార్పులు, సంస్కరణల కారణంగా పార్టీ కేడర్ కు గౌరవం దక్క లేదు.. నాయకత్వం, కేడర్ ను నిర్లక్ష్యం చేయాలనే ఉద్దేశం లేకపోయినా.. ప్రభుత్వం – పార్టీ మధ్య దూరం పెరిగిందన్నారు. పథకాలు, పరిపాలన ప్రజల ఇంటికే తెచ్చిన సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలను ప్రవేశ పెట్టినా.. ఎందుకు గెలవలేకపోయామోసమాధానం వెతుక్కోవాలన్నారు.
Read Also: JD Lakshmi Narayana: ప్రత్యేక హోదాయే మార్గం.. ఇప్పుడు అవకాశం వచ్చింది..
Also Read
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ఇక, ప్రభుత్వం మారిన 48 గంటలు తిరగక ముందే రాష్ట్రంలో దాడులు పెరిగాయి అని ఆవేదన వ్యక్తం చేశారు గుడివాడ అమర్నాథ్.. వైసీపీకి ఓటేశారనే కక్షతో ఇళ్లకు వెళ్లి మరీ కొడుతున్నారు.. కానీ, దాడుల సంస్కృతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవుపలికారు.. ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్’ అనే మా అధినాయకుడు చెప్పిన మాటకు కట్టుబడి ప్రజా సమస్యలపై మా పోరాటం కొనసాగుతుందన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమస్యలు, ప్రజా అవసరాల కోసం పొరాడతాం.. ప్రతిపక్షంగా ప్రభుత్వానికి ఏడాది సమయం ఇస్తాం.. హామీలు నిలబెట్టు కోకపోతే ప్రభుత్వాన్ని ఎండగడతాం అన్నారు. కాగా, 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన గుడివాడ అమర్నాథ్.. వైఎస్ జగన్ కేబినెట్‌లో చివరి రెండేళ్లలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికల్లో ఆయన్ను గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది వైసీపీ.. అయితే, టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చేతిలో గుడివాడ అమర్నాథ్ ఓటమిపాలైన విషయం విదితమే.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!