చిన్న చిన్న కారణాలకే కొందరు తొందరపాటు నిర్ణయాలతో జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కళ్లు తెరిచి చూసేలోపే అంతా చీకటైపోతుంది. ఇంతకీ ఏమైందంటారా? భర్త షికారుకి తీసుకెళ్లలేదని.. ఆవేశంలో ఓ ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఏపీలోని అనకాపల్లి పట్టణంలో జరిగింది.
ఇది కూడా చదవండి: Home Ministry: ముగ్గురు ఐపీఎస్‌లకు కేంద్రం షాక్.. 24 గంటల్లో ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు..
వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి పట్టణంలో నివాసం ఉంటున్న మంగరాపు జ్యోతి.. అబ్దుల్ గని భార్యాభర్తలు. వీరిద్దరూ 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఏడు నెలల కుమారుడు ఉన్నాడు. అయితే భార్య, కుమారుడిని చూసేందుకు భర్త అబ్దుల్ గని అనకాపల్లి వచ్చాడు. అయితే తనను షికారుకు తీసుకెళ్లాలని భర్తను కోరింది. ఇంతలో తల్లి జోక్యం చేసుకుని.. ఈ సమయంలో ఎందుకమ్మా? అని మందలించింది. అంతే ఆవేశంగా మేడ మీదకు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటినా.. విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జ్యోతి ప్రాణాలు వదిలింది. దీంతో ఏడు నెలల చిన్నారి.. తల్లి లేని బిడ్డయ్యాడు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: Cigarette Price Hike: స్మోకింగ్ లవర్స్ కి షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్ల ధరలు!