హార్డ్ వర్క్ ముఖ్యం కాదని, స్మార్ట్ వర్క్ కావాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. సంక్షోభాలనే అవకాశాలుగా మలచుకోవాలన్నారు. ఓటే దేశాన్ని ఇంతవరకూ కాపాడుతూ వస్తోందని, ప్రజాస్వామ్యం లేకపోతే నియంతృత్వం వస్తుందన్నారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరిందని, మంత్రి నారా లోకేశ్ కృషి వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు.…
త్వరలో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఒక కీలక ప్రకటన చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. ఆంధ్ర యూనివర్సిటీని ఐదేళ్లలో టాప్ 3లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.. ప్రపంచ స్థాయిలో ఆంధ్ర యూనివర్సిటీని టాప్ యూనివర్సిటీలో ఒకటిగా ఉంచాలన్నారని తెలిపారని గుర్తుచేసుకున్నారు..
టెక్నాలజీ మన జీవితంలో భాగమైపోయిందన్నారు సీఎం చంద్రబాబు.. టెక్నాలజీ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతోందన్న ఆయన.. సాంకేతికతతో అనేక మార్పులు వస్తున్నాయన్నారు.. ఏపీని నాలెడ్జ్ హబ్గా మార్చాలని అనుకుంటున్నాం అన్నారు.. ఇప్పుడు డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణగా అభిర్ణించారు.. ఇక, ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త, ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలనే నినాదం తీసుకున్నామని వెల్లడించారు ఏపీ సీఎం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు విశాఖపట్నం రానున్నారు.. ఈ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్రఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ముంబైలోని ఆజాద్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న దేవేంద్ర ఫడ్నవీస్.. ఈ కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా విశాఖ రానున్నారు..
విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కిరెడ్డిపాలెంలో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. వెంకటేశ్వర కాలనీలో అపార్ట్మెంట్ పైనుంచి దూకి జంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. మృతులు పిల్లి దుర్గారావు, సాయి సుష్మితలుగా గుర్తించారు.
విశాఖ గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పేమ పేరుతో నమ్మించి... పెళ్లి చేసుకుంటానని వంచించిన ఓ కిరాతకుడు దారుణానికి ఒడిగట్టాడు. విశాఖకు చెందిన లా స్టూడెంట్ను లవ్ పేరుతో ట్రాప్ చేసిన వంశీ అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడి చేయడంతో పాటు తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.. దీంతో.. కేసు దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు..
సింహాచలం దేవస్థానం ఆలయ భూములు అన్యాక్రాంతంపై విజిలెన్స్ విచారణ జరగనుంది. త్రీమెన్ కమిటీ నివేదిక ఆధారంగా విజిలెన్స్ విచారణ జరపనుంది. కమిటీ సభ్యులను కూడా విజిలెన్స్ అధికారులు విచారించనున్నారు.
విశాఖలో న్యాయ విద్య అభ్యసిస్తోన్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు యువకులు.. అంతటితో ఆగకుండా.. ఆ దృశ్యాలను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు.. బాధితురాలని నగ్నంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు.. ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని మళ్లీ మళ్లీ అత్యాచారానికి ఒడిగట్టారు.
విశాఖపట్నం గాజువాకలో దారుణం జరిగింది.. పెదగంట్యాడ లో యువతిపై జమ్మూ కాశ్మీర్కు చెందిన నీరజ్ శర్మ రాడ్తో దాడి చేశాడు.. అడ్డుకునేందుకు యత్నించిన మరో ఇద్దరిపై కూడా దాడికి పాల్పడ్డాడు.. అయితే, బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు.. ఉన్మాది దాడిలో గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. ఇక, ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడ్డ యువతికి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు... తలపై సుమారు 30 కుట్లు పడ్డాయి.. ప్రేమోన్మాది దాడి…