Speaker Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు.. పర్యాటకులు బీచ్‌కు వచ్చేదే ఎంజాయ్ చేయడానికి.. కానీ, నిబంధనల పేరుతో వారిని నియంత్రిస్తే ఎవరు వస్తారు? అని ప్రశ్నించారు.. వైజాగ్ వచ్చే పర్యాటకులు బీచ్‌లో కూర్చుని టీ తాగడానికి రారు.. వాళ్లకు కావాల్సింది ఎంజాయ్‌మెంట్ అన్నారు అయ్యన్నపాత్రుడు.. నిబంధనల పేరుతో నియంత్రణ పెడితే పర్యాటకులు రారన్న ఆయన.. ఎంజాయ్ చేయడానికి అవసరమైన సౌకర్యాలు ఉండాలన్నారు. టూరిజంకు మినహాయింపులు ఇవ్వాలని పేర్కొన్నారు.. రూల్స్ అవసరమే.. కానీ, కొంత వెసులు బాటు వుండాలన్నారు.. గిరిజన ప్రాంతాలలో పెట్టుబడి పెట్టేందుకు స్థానికులు ఉండాలనే నిబంధనకు పరిష్కారం చూడాలి.. ఆఫీసియల్స్ పాజిటివ్ మైండ్‌తో వుండాలన్నారు.
Read Also: CM Chandrababu: ప్రజలే ఫస్ట్ అనే నినాదంతో పనిచేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
విశాఖలో జరుగుతోన్న పర్యాటక పెట్టుబడుల ప్రాంతీయ సదస్సులో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. మంత్రి కందుల దుర్గేష్‌తో కలిసి “అరకు చలి ఉత్సవం” బ్రోచర్ విడుదల చేశారు.. పలు కంపెనీలో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నాయి.. పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఒప్పందాలు శ్రీకారం చుట్టనున్నాయి.. ఇక, ఈ సందర్భంగా లోకేష్ డిప్యూటీ సీఎం అంశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ చేయడానికి రాజకీయ నాయకులు ఎవరు..? ఆయన డిప్యూటీ సీఎంపై ప్రజలే నిర్ణయించాలన్నారు.. ఇక, ఇన్వెస్టర్లకు అనుమతి ఇవ్వడానికి ఏడాది కాలం తిరిగాల్సిన అవసరం ఏముంది.. కాలయాపన కారణంగా పెట్టుబడిదారులు వెనక్కిపోతున్నారని.. అప్లికేషన్ వచ్చిన వారం రోజుల్లో రెస్పాన్స్ వచ్చేలా చర్యలు ఉండాలని సూచించారు.. వైజాగ్ లో బీచ్ వాలీబాల్, కబడ్డీ పెట్టాలన్నారు అయ్యన్న పాత్రుడు..
Read Also: Priyanka Chopra: SSMB29 మూవీ కోసం ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ప్రకృతి వనరులు ఉన్నా పర్యాటక అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అయ్యన్నపాత్రుడు.. ఇతర రాష్ట్రాల నుంచి లంబసింగికి పర్యాకులు వస్తున్నా.. కనీస వసతులు లేవన్న ఆయన.. ఆరేళ్ల క్రితం మొదలు పెట్టిన కాటేజ్ నిర్మాణం ఇప్పటి వరకు పూర్తి కాలేదన్నారు.. ఫ్రీడం ఫైటర్ అల్లూరి స్మారక పార్క్ ను టూరిజంతో అనుసంధానం చేయాలని సూచించారు.. బొజ్జన్న కొండ, అరకు వ్యాలీ వంటి ప్రాంతాలు పూర్తి స్థాయి అభివృద్ధికి నోచుకోవాలి.. పర్యాటక అభివృద్ధిలో ఎందుకు వెనకబడ్డామో పరిశీలించాలని కీలక సూచలను చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు..