Minister Nara Lokesh: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ టీమ్ దావోస్ పర్యటనపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న వేళ.. కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. ఓ కేసులో కోర్టులో హాజరుఅయ్యేందుకు విశాఖ వచ్చిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడు నెలలలో ఆరు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు.. ఇక, 2019లో బ్లూ మీడియా నాపై అసత్య కథనం ప్రచురించింది. తప్పుడు కథనంపై సమాధానం చెప్పాలని అప్పుడే నేను లీగల్ నోటీసు జారీ చేశాను అన్నారు.. మరోవైపు.. తన పాదయాత్రకు రెండేళ్లు అయిన సందర్భంగా.. రాజకీయాలలో పాదయాత్ర ఎంబీఏ లాంటిది అని పేర్కొన్నారు.. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటు వస్తున్నాము. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు పై విచారణ జరుగుతుంది. విశాఖలో జరిగిన అక్రమాలపై కూడా విచారణ సాగుతోంది.. అన్ని వ్యవహారాలపై విచారణ ఒకేసారి జరిగితే ఉన్న పోలీసులు సరిపోరు. క్రమంగా అన్నింటిపై విచారణ జరుగుతుందన్నారు..
Read Also: Ration Cards: రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!
ఇక, ఏడు నెలలలో ఆరు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చాము. ఆరు లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకు వచ్చామని వెల్లడించారు నారా లోకేష్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1997 నుంచి దావోస్ కి వెళ్తున్నారని గుర్తుచేసిన ఆయన.. గత ప్రభుత్వంలో ఒప్పందాలు జరిగితే ఎందుకు పరిశ్రమలు స్థాపించలేకపోయారు..? అని నిలదీశారు.. మహారాష్ట్రకు ఎక్కువ పెట్టుబడుల రావడానికి కారణం ఒకే ప్రభుత్వం కొనసాగడంగా పేర్కొన్న ఆయన.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెట్టిన సంస్థల ప్రతినిధులను గతంలో జగన్మోహన్ రెడ్డి కలవలేదని దుయ్యబట్టారు.. గుజరాత్ లో 5వ సారి బీజేపీ ప్రభుత్వం రావడం వలన అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు..
Read Also: Amit Shah : ప్రయాగ్‌రాజ్ చేరుకున్న హోంమంత్రి అమిత్ షా.. మరికొద్ది సేపట్లో సంగంలో పవిత్ర స్నానం
మన రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు అభివృద్ధిని పరుగులు పెట్టించాం.. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి గెలవాల్సి ఉందన్నారు లోకేష్.. అయితే, చంద్రబాబు పై మాకు నమ్మకం ఉంది.. కానీ, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవలేరు అని హామీ ఇవ్వగలరా? అని దావోస్ ప్రతినిధులు అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాం అన్నారు.. మరోవైపు.. రోజాపై సెటైర్లు వేసిన లోకేష్.. అసలు రోజా కు దావోస్ కు జ్యూరీచ్ కు తేడా తెలియదు అని ఎద్దేవా చేశారు.. రెడ్ బుక్ కోసం ఎందుకు వైసీపీ నాయకులు భయపడుతున్నారని ప్రశ్నించారు.. ఇక, విశాఖలో 90 రోజులలో టీసీఎస్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్..