విశాఖలో నవ వధువు వసంత అనుమానాస్పద మృతి కేసులో భర్త అఘాయిత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త నాగేంద్రను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇక నాగేంద్ర మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ నిండా వందలాది పోర్న్ వీడియోస్ ఉన్నట్లుగా గుర్తించారు. ఇక అతడి గూగుల్ హిస్టరీ చూసి కూడా పోలీసులు షాక్ తిన్నారు. శృంగార సామర్థ్యం పెంచేందుకు అనేక మందుల కోసం కామ పిశాచి నాగేంద్ర సెర్చ్ చేసినట్లుగా కనిపెట్టారు.
ఇది కూడా చదవండి: Canada : చండీగఢ్ లో దాచుకున్న కెనడాలో కోట్ల బంగారం దోచుకున్న దొంగ
ఇక వసంత మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. భర్తే చంపేసి ఆత్మ హత్య చేసుకుందని డ్రామాలు ఆడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నాగేంద్రను తిరిగి కష్టడిలోకి తీసుకునే ఆలోచనలో పోలీసులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi Mobile: వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసుల సోదాలు..
విశాఖపట్నం జిల్లా గోపాలపట్నానికి చెందిన నాగేంద్ర, వసంతలకు 11 నెలల క్రితం పెళ్లైంది అని బంధువులు తెలిపారు. నాగేంద్రకు నరాల బలహీనత ఉండటంతో.. పెళ్లయిన నెల రోజుల తర్వాత నుంచి హిమాలయ CONFIDO టాబ్లెట్స్ వాడుతున్నాడు అని చెప్పారు. కానీ శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు నెలకు ఒక బాటిల్ కొంటున్నాడని.. అందులోని 60 టాబ్లెట్స్ ను రోజుకు రెండు చొప్పున వాడుతున్నాడే విషయం తర్వాత తెలిసిందన్నారు. మొదట్లో ప్రొటీన్, విటమిన్ టాబ్లెట్స్ అని చెప్పుకొచ్చిన నాగేంద్ర.. భార్యకు నెలసరి రోజుల్లో కూడా భర్త వదల లేదని బంధువులు వెల్లడించారు.
తీవ్ర రక్త స్రావంతో స్పృహ కోల్పోయిన భార్య వసంత.. స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడంతో ఇప్పటి వరకు ఆమె గర్భం దాల్చలేదు.. పోర్న్ వీడియోలు చూసి అడిక్ట్ ఆయినా భర్త.. పోర్న్ వీడియోస్ లో ఉన్న విధంగా శృంగారం చేయాలని భార్యను తీవ్ర ఒత్తిడికి గురి చేసేవాడని బంధువులు చెప్పుకొచ్చారు. భర్త వికృతి చేష్టలకు, ఒత్తిడికి గురై నరక యాతన అనుభవించిన భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, అత్తింటివారే తన కూతుర్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి ఆరోపించింది.