హైదరాబాద్ లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ను ఆస్ట్రేలియా ఆరోగ్య మంత్రి అంబర్-జాడే శాండర్సన్ సందర్శించారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని హెల్త్ కేర్ సంస్థల మధ్య స్కిల్లింగ్ రంగంలో సహకారానికి అవకాశాల కోసమే ఈ సందర్శన లక్ష్యం. ఈ సందర్భంగా.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రభుత్వ వ్యూహాత్మక సలహాదారు (ఇండియా) డాక్టర్ పాడీ రామనాథన్.. ఆరోగ్య నైపుణ్యంలో సంభావ్య సహకార మార్గాలను వెల్లడించారు. అంతేకాకుండా.. పిల్లల సంరక్షణలో అత్యుత్తమ కేంద్రంగా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ను గుర్తించాలని సూచించారు.…
ఏపీలో రేపటి నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ఈ క్రమంలో.. రేపు ఎన్నికల అధికారుల బృందం విజయవాడ చేరుకోనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. ఈ నెల 9వ తేదీన వివిధ రాజకీయ పార్టీలతో భేటీ కానున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రేపు ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు ఆ రెండు జిల్లాల్లో 'రా కదలిరా' సభలకు హాజరుకానున్నారు. తిరువూరులో అయ్యప్పస్వామి ఆలయం వద్ద, ఆచంటలో ఆచంట-మార్టేరు రోడ్ వద్ద ఈ సభలు జరగనున్నాయి.
మేడిగడ్డలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మేడిగడ్డ నిర్మాణంపై అధికారులు రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను పరిశీలించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళపై తాము చెప్తున్న విషయాలు నిజం అయ్యాయని తెలిపారు. లక్షల కోట్లు అప్పు.. పదుల కోట్లు బిల్లులు బకాయి అని ఆరోపించారు. మరి ప్రాజెక్టు కట్టిన ప్రయోజనం ఏంటి అని ప్రశ్నించారు.…
క్రిస్మస్ సందర్భంగా తన అధికారిక నివాసాన్ని పాఠశాల విద్యార్థినులు సందర్శించారు. ఈ సందర్భంగా.. వారి ముఖాల్లో సంతోషం స్పష్టంగా కనిపిస్తున్న వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పిల్లలు థంబ్స్-అప్ ఇవ్వడంతో తన కార్యాలయం అంతిమ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్టు అనిపిస్తోందని ప్రధాని అన్నారు.
పంచాయితీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన సొంత ఇలాకాలో పర్యటించనున్నారు మంత్రి సీతక్క. రేపు (ఆదివారం) ఉదయం హైదరాబాద్ క్వార్టర్స్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరుతారు. ఉదయం 9:15 గంటలకు ములుగు మండలంలోని మహమ్మద్ గౌస్ పల్లికి చేరుకుంటారు. అనంతరం.. ఉదయం 10:15కు ములుగు గట్టమ్మ దేవాలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
మంత్రిగా తొలిసారి కరీంనగర్ వచ్చిన పొన్నం ప్రభాకర్ కి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అల్గునుర్ చౌరస్తా నుంచి తెలంగాణ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్వాగత సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తూ.. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. నేను మంత్రిని అయినా కరీంనగర్ బిడ్డనే.. ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన సాధారణ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎంపీని చేసింది, మంత్రిని చేసిందన్నారు.…
రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో.. అలుగునుర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారయణ, మేడిపల్లి సత్యంకు భారీ గజమాలతో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదనంతరం పది సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం ఈనెల 18 నుంచి రాష్ట్రపతి హైదరాబాద్ కు రానున్నారు. ఈ నెల 23 వరకు అంటే ఐదు రోజుల పాటు.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమే బస చేయనున్నారు. అనంతరం తిరిగి 23వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు.
సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో మాజీ సీఎం కేసీఆర్ను మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ పరామర్శించారు. అనంతరం ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించేందుకు వచ్చామని తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు... బహుశా రెండ్రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని మంత్రులు పేర్కొన్నారు.