ప్రధాని మోడీ సోమవారం రెండు దేశాల పర్యటనకు వెళ్తున్నారు. ఫ్రాన్స్, అమెరికాలో మోడీ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 11న ఏఐ సమ్మిట్‌కు ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు.
సీఎం చంద్రబాబు నేతృత్వంలో 9 మంది బృందం దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు దావోస్‌లో పర్యటించనున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సు (వరల్డ్ ఎకానామిక్ ఫోరం)లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద ఏర్పాటైన ప్రపంచంలోనే అతి పెద్దదైన పిన్నాపురం గ్రీన్‌కో సోలార్ పవర్ ప్రాజెక్టు పవర్ హౌస్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఇక్కడ ఒకే ప్రాంతంలో విండ్ పవర్, సౌర విద్యుత్, హైడల్ పవర్ యూనిట్స్ ఉన్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఈనెల 8న మోడీ విశాఖకు రానున్నారు. పర్యటనలో భాగంగా.. ఎన్టీపీసీ ప్రాజెక్ట్, వైజాగ్ రైల్వే జోన్, జోనల్ హెడ్ క్వార్టర్ శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన చేస్తారు. అంతేకాకుండా.. కొన్ని పూర్తి అయిన ప్రాజెక్ట్‌లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లుండి (31వ తేదీ)న పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గం, యల్లమంద గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం.
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. అనంతరం.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. హరీష్ రావు వెంట బీఆర్ఎస్ నేతల బృందం కూడా ఉంది.
మెదక్ జిల్లాలో రేపు (బుధవారం) పలువురు ప్రముఖులు పర్యటించనున్నారు. అందుకోసం అధికారులు ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు. రేపు వేర్వేరు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. అనంతరం.. కుటుంబ సభ్యులను బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ ఘటనను రాజకీయం చేయడం తగదని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.. సినీ రంగంలో మార్పులు చేర్పులు అవసరం అని కూనంనేని సాంబశివరావు అభిప్రాయ పడ్డారు.