హైదరాబాద్ లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ను ఆస్ట్రేలియా ఆరోగ్య మంత్రి అంబర్-జాడే శాండర్సన్ సందర్శించారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని హెల్త్ కేర్ సంస్థల మధ్య స్కిల్లింగ్ రంగంలో సహకారానికి అవకాశాల కోసమే ఈ సందర్శన లక్ష్యం. ఈ సందర్భంగా.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రభుత్వ వ్యూహాత్మక సలహాదారు (ఇండియా) డాక్టర్ పాడీ రామనాథన్.. ఆరోగ్య నైపుణ్యంలో సంభావ్య సహకార మార్గాలను వెల్లడించారు. అంతేకాకుండా.. పిల్లల సంరక్షణలో అత్యుత్తమ కేంద్రంగా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ను గుర్తించాలని సూచించారు. ఆస్ట్రేలియా ఆరోగ్య మంత్రి అంబర్-జేడ్ శాండర్సన్ ఆసుపత్రిలో పలు సౌకర్యాలను పరిశీలించిన తర్వాత యాజమాన్యంను ప్రశంసించారు. ఆదర్శప్రాయమైన రీతిలో హాస్పిటల్ నిజంగా అత్యుత్తమమైన రీతిలో ఉందని అభినందించారు. ” మాతృమూర్తులు మరియు శిశు ఆరోగ్యంలో ఆసుపత్రి అందిస్తున్న సంరక్షణ నాణ్యత, పని పరిమాణం అభినందనీయం” అని పేర్కొన్నారు. వైద్యులు, నర్సుల సహకారం.. మార్పిడి కోసం తాను ఖచ్చితంగా ఒక అవకాశాన్ని చూస్తానని ఆమే పేర్కొన్నారు.
డాక్టర్లు, నర్సుల కోసం నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు, అత్యవసర రవాణా మరియు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ద్వారా అందించబడుతున్న అత్యవసర సంరక్షణ సేవల పట్ల మంత్రి బాగా ఆకర్షితులయ్యారు. పీడియాట్రిక్ కాలేయ మార్పిడి, మూత్రపిండ మార్పిడి, BMT వంటి ఆసుపత్రి అందిస్తున్న పీడియాట్రిక్ అవయవ మార్పిడితో సహా కేర్ సేవలను ఆమె ప్రశంసించారు. ఈ సందర్భంగా.. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సిఎండి డాక్టర్ రమేష్ కంచర్ల మాట్లాడుతూ.. “మంత్రి అంబర్-జేడ్ శాండర్సన్ కు ఆతిధ్యం ఇవ్వడం, సహకార అవకాశాలను అన్వేషించడం, ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ భాగస్వామ్యానికి, విజ్ఞాన మార్పిడి, పురోగతిని ప్రోత్సహించడంలో ముఖ్యమైన దశను గుర్తించడం, మాకు గౌరవంగా ఉంది. ఆస్ట్రేలియా నుండి మంత్రి, ప్రతినిధులను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము..” అని అన్నారు.
Akhilesh Yadav: అక్రమ మైనింగ్ కేసులో ఎస్పీ చీఫ్ అఖిలేష్‌కి సీబీఐ సమన్లు..!
“రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్, దాని ప్రారంభం నుండి ఒకే యూనిట్ గా సేవలను అందించి, ఇప్పుడు చిల్డ్రన్స్ హాస్పిటల్స్ లో ప్రముఖ చైన్ గా అభివృద్ధి చెందింది. మా అంకితభావం మన సరిహద్దులకు నుంచి విస్తరించి ఉంది, మన దేశానికి మాత్రమే కాకుండా ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్యంలోని దేశాలకు కూడా పిల్లల సంరక్షణలో శ్రేష్టతను ఇది అందిస్తుంది. మేము ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1900 పడకలతో 19 ఆసుపత్రులను నిర్వహిస్తున్నాము. అభివృద్ధి చెందిన దేశాలతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా మరింత ఆరోగ్యకరమైన చిరునవ్వులను వ్యాప్తి చేయడానికి సమిష్టిగా కృషి చేయనున్నాము” అని అన్నారాయన. రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పీడియాట్రిక్ మరియు మెటర్నల్ హెల్త్ కేర్ లో చేస్తున్న అన్ని ఆదర్శప్రాయమైన సేవల గురించి ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ డైరెక్టర్- రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్, డాక్టర్ దినేష్ కుమార్ బిర్ల ఆస్ట్రేలియన్ ప్రతినిధులతో వెల్లడించారు.
పశ్చిమ ఆస్ట్రేలియా నుండి ప్రతినిధులు, MS. స్టాసీ హెర్న్, మంత్రికి చీఫ్ ఆఫ్ స్టాప్, ఆరోగ్య శాఖ, WA ప్రభుత్వం, MS జోడీ సౌత్, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్, క్లినికల్ ఎక్సలెన్స్ విభాగం, ఆరోగ్య శాఖ, డాక్టర్ జగదీష్(జాగ్స్) కృష్ణన్ ఎమ్మెల్యే, ప్రీమియర్ పార్లమెంటరీ సెక్రటరీ, WA ప్రభుతం, శ్రీమతి లూసీ కిర్వాన్ వార్డ్, డైరెక్టర్ మినిస్టీరియల్స్ మిషన్స్ అండ్ డెలిగేషన్స్ మరియు ఉద్యోగాలు, టూరిజం, సైన్స్ అండ్ ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. ఆరోగ్య సంరక్షణలో భవిష్యత్ భాగస్వామ్యాలు, జ్ఞాన మార్పిడిని ప్రోత్సహించడం, రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మరియు పశ్చిమ ఆస్ట్రేలియా ఆరోగ్య రంగాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం వంటి సానుకూల దృక్పథంతో ఈ పర్యటన ముగిసింది.