Draupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం ఈనెల 18 నుంచి రాష్ట్రపతి హైదరాబాద్ కు రానున్నారు. ఈ నెల 23 వరకు అంటే ఐదు రోజుల పాటు.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమే బస చేయనున్నారు. అనంతరం తిరిగి 23వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు.
Read Also: Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి పై కేసు నమోదు..
కాగా..రాష్ట్రపతి రాక సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకోని, రాష్ట్రపతి విడిది ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. మరోవైపు.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి అధికారులకు తెలిపారు.
Read Also: Big Breaking: ప్రజలకు శుభవార్త.. రూ. 25 లక్షల వరకూ వైద్యం ఉచితం!