రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ ఉపాధ్యాయుడు తన ఇంట్లో సమస్యలను దూరం చేసుకోవాలనుకున్నాడు. పరిష్కారం కోసం ఒక తాంత్రికుడి వద్దకు వెళ్లాడు. అయితే.. ఆ తాంత్రికుడు తన ఆస్తులన్నీ కాజేశాడు. దీంతో.. బాధితుడు ఆస్తులు, తన కుటుంబాన్ని రెండింటిని కోల్పోయాడు. కాగా.. ఈ ఘటనలో బాధితుడు భార్య సుష్మా దేవదా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాంత్రికుడు, అతని కుమారుడు సహా నలుగురిపై కేసు పెట్టింది. ఈ వ్యవహారం 2023లో మొదలు కాగా.. పోలీసులు విచారణ చేపట్టారు.
చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కాసేపట్లో బిగ్ ఫైట్ జరుగనుంది. ఈ రెండు జట్ల మధ్య లీగ్‌లో ఇదే చివరి మ్యాచ్ అయినప్పటికీ ప్లేఆఫ్స్ కారణంగా ఈ మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. అయితే బెంగళూరు మాత్రం 18 పరుగుల తేడాతో లేదా 18.1 ఓవర్లలో ఛేజింగ్ చేసి గెలిస్తే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ…
కాసేపట్లో చార్మినార్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొన్న అమిత్ షా.. మీటింగ్ అనంతరం చార్మినార్ బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడ భాగ్యలక్ష్మీ టెంపుల్ కు చేరుకుని .. భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్నారు అమిత్ షా. అమిత్ షా పర్యటన సందర్భంగా.. టెంపుల్ దగ్గర భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. CAA అమలు తరువాత తొలిసారి ఓల్డ్ సిటీకి వస్తున్నారు. దీంతో భద్రత కట్టుదిట్టం చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో ముఖ్యమంత్రి వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. అధికారికంగా ఖరారైన సీఎం పర్యటన వివరాలు ఇలా..
భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సతీసమేతంగా కలిసి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఉద్యోగులను పట్టించుకోలేదని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా.. ముందుగా ఎంజీఎం మహిళా సిబ్బంది అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు అందరూ ప్రభుత్వం గెలుపుకు కారణం అయినందుకు మీరందరికి చెప్పినట్లుగానే ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మీరు నర్సింగ్ ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకుని పేషంట్లకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని…
ప్రధాని మోడీ కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 7.50కు బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా సిటీలో హై అలెర్ట్ ప్రకటించారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. కాగా.. ఈరోజు రాత్రికి ప్రధాని మోడీ రాజ్ భవన్ లో బస చేయనున్నారు. అనంతరం.. రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు.
ఈనెల 5, 7వ తేదీల్లో సీఎం జగన్ (CM Jagan) ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తెలిపారు. విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ సందర్శనకు పోవాలి.. క్షమాపణ చెప్పాలని అన్నారు. చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ పోయి చూసి.. ప్రజలకు క్షమాపణ చెప్తే బాగుంటుందని ఆరోపించారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.. బీఆర్ఎస్ వాళ్లకు అన్నీ చూపెట్టమని అని తెలిపారు. కాళేశ్వరంపై పెద్ద ఫ్రాడ్ చేసి.. ఉల్టా తమపై ఆరోపణలు చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారు.