మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సుడిగాలి పర్యటన చేశారు. నగరశివారులోని 15 చెరువుల ఆక్రమణ పై ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ అక్కడికి వెళ్లారు. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సాయంత్రం వేళ పర్యటించారు. ఫాక్స్ సాగర్, దూలపల్లి అశోక్ విల్లాస్ దగ్గర నాలా కబ్జాను, పలు చెరువులను ఆయన పరిశీలించారు.
నల్గొండ జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా.. సుంకిశాల ప్రాజెక్టును మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సందర్శించారు. కూలిన రిటైనింగ్ సైడ్వాల్ను పరిశీలించారు. నీట మునిగిన ఇన్టెక్ వెల్, పంపింగ్ స్టేషన్ను మంత్రులు పరిశీలించారు.
వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ ఇండియా పర్యటనకు వచ్చారు. ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు.. చిన్హే భారత పర్యటనలో ఉంటారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. ఈ పర్యటనలో ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక చర్చలపై చర్చించనున్నారు.
Uttam Kumar Reddy: సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పనులపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ క్రమంలో.. ఈరోజు వరంగల్ పర్యటన రేపటికి వాయిదా పడింది. నేడు జరగాల్సిన కార్యక్రమాలు యధావిధిగా రేపటికి వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం.. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం వరంగల్‌లో పర్యటించాల్సి ఉంది. మధ్యాహ్నం 1:30కి టెక్స్‌టైల్ పార్క్‌కు చేరుకుని, అనంతరం 2:10కి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలించాల్సి ఉంది. ఓరుగల్లులో మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించడంతో పాటు సాయంత్రం వరంగల్ మున్సిపల్ అధికారులతో సమీక్ష జరపాల్సి…
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు కుప్పంలో పర్యటించనున్నారు. రెండో రోజు షెడ్యూల్లో భాగంగా.. కుప్పం ఆర్ అండ్ బి అతిధి గృహము నందు ఉదయం10.30 గంటలకు ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నారు. అనంతరం.. మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు కుప్పం నియోజకవర్గ అధికారులతో సమీక్షా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆడిటోరియం నందు పార్టీ శ్రేణులతో సమావేశం చేపట్టనున్నారు. ఆ…
ఇటలీలో జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇటలీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఇటలీ పర్యటనలో జీ7 దేశాల ఔట్ రీచ్ సదస్సుకు హాజరైన మోడీ.. వివిధ దేశాధినేతలతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ను పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ రోజు ఆకస్మికంగా సందర్శించారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నారెడ్డితో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
జేఎన్టీయూ కొత్త ఇంఛార్జ్ వైస్ ఛాన్సలర్గా నియమితులైన బుర్రా వెంకటేశం నేడు జేఎన్టీయూని సందర్శించారు. వైస్ ఛాన్సలర్ ఛాంబర్ లో డైరెక్టర్ కె. విజయకుమార్ రెడ్డి, రిజిస్టార్ కె. వేంకటేశ్వరావుల సమక్షంలో యూనివర్సిటీలోని డైరెక్టర్లను, కాలేజ్ ప్రిన్సిపాల్, క్యాంపస్ కాలేజీలోని పలు డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఆచార్య వర్గాన్ని, ఆయా డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు, ఇంచార్జ్ వైస్ ఛాన్స్లర్కు రిజిస్టార్ పరిచయం చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్. 12 లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. సీఎం అయిన తరువాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి చేరుకోగానే సీఎం రేవంత్ రెడ్డికి సీఎస్ శాంతకుమారి, తెలంగాణ డీజీపీ రవి గుప్తా, హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పలువురు ఉన్నతధికారులు స్వాగతం పలికారు. అనంతరం సైబర్ సెక్యూరిటీ వింగ్, డ్రగ్స్ కంట్రోల్ వింగ్ సెంటర్లను సీఎం…