మంత్రిగా తొలిసారి కరీంనగర్ వచ్చిన పొన్నం ప్రభాకర్ కి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అల్గునుర్ చౌరస్తా నుంచి తెలంగాణ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్వాగత సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తూ.. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. నేను మంత్రిని అయినా కరీంనగర్ బిడ్డనే.. ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన సాధారణ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎంపీని చేసింది, మంత్రిని చేసిందన్నారు. చొక్కారావు శిష్యుణ్ణి మంత్రిని చేసింది కరీంనగర్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ.. ప్రజా పాలన అందించే పార్టీ… నియంతృత్వాన్ని బద్దలు కొట్టి ఈరోజు ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టామని మంత్రి పేర్కొన్నారు.
Viral Video : స్టూడెంట్స్ తో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన టీచర్స్.. వావ్ సూపర్ కదా..
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని మంత్రి పొన్నం ఆరోపించారు. ఆయన అనారోగ్యంతో ఉంటే పరామర్శించాం.. వారి పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి లాంటి వారు ప్రభుత్వం పడిపోతుంది అంటున్నారు.. కేసీఆర్, కేటీఆర్ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని దుయ్యబట్టారు. విద్యుత్ శాఖ అప్పులు 80 వేల కోట్లు, సివిల్ సప్లై శాఖ అప్పు 56 వేల కోట్లు అని బయటపడిందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలు ఇంకెన్ని బయటపడతాయోనని అన్నారు.
Vyuham censor: ఎట్టకేలకు సాధించిన వర్మ.. వ్యూహం సెన్సార్ చేయించాడుగా!
అక్రమాలు చేసి అప్పులు చేసిన కేసీఆర్.. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చేతగాని దద్దమ్మలు పార్టీలు మారి.. తనపై విమర్శలు చేసినా భరించానన్నారు. ఆ ఓపిక ఈ స్థాయిని ఇచ్చిందని తెలిపారు. విద్యార్థి దశ నాయకత్వం నుంచే అనేక దాడులు ఎదుర్కొన్నాను.. ప్రజలిచ్చిన అండతో దాడులు ఎదుర్కొన్నానని చెప్పారు. తన 36 ఏళ్ల రాజకీయ జీవితంలో తప్పు చేయలేదు.. క్షమాపణ అడిగే స్థితి రాలేదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో వారికి మరింత సేవ చేసే బలం వచ్చింది.. ఒక విద్యార్థి నాయకుడికి వచ్చిన అవకాశం అందరికి సంతోషాన్ని స్ఫూర్తిని ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు.