రేపటి నుంచి సీఎం జగన్ వరద ప్రభావిత, ముంపు మండలాల్లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు సీఎం పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో ఒక్కింటి వాడయ్యే అవకాశాలున్నాయి. ఆయనకు మంచి అమ్మాయిని వెతకాలని స్వయానా రాహుల్ తల్లి సోనియా గాంధీ హర్యానా మహిళకు సూచించింది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. రాజకీయ ఎత్తుగడలు మాత్రం మొదలయ్యాయి. అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ పాకులాడుతుండగా.. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అందుకోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల సమరంలో జోరుమీదున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ.. శుక్రవారం గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో పర్యటించనున్నారు.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల కంటే ముందు ప్రచారం ముగించుకొని తిరిగి ఇంటి వస్తుండగా హత్యకు గురైన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తను రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద బోస్ నేడు పరామర్శించనున్నారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కోసం తాము వేయి కళ్లతో ఎదురు చూస్తు్న్నట్టు అమెరికా కాంగ్రెస్ సభ్యులు తెలిపారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ప్రధాని మోడీ అమెరికా పర్యటన చేయనున్న నేపథ్యంలో
Bhuma AkhilaPriya : ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. దీంతో నష్టపోయిన రైతులను మాజీమంత్రి భూమా అఖిలప్రియ పరామర్శించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి కేటీఆర్ చేరుకుంటారు. రూ.275.95 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు మంత్రి.
ఇప్పటివరకు జరిగిన అగ్ని ప్రమాదాలకు సంబంధించిన బిల్డింగ్‌లన్నీ అక్రమ కట్టడాలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని మంత్రి పరిశీలించారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నారాయణ పేట జిల్లాలో ఇవాళ (సోమవారం) పర్యటించనున్నారు. నారాయణ పేట జిల్లా కేంద్రంతో పాటు నారాయణ పేట మండల పరిధి అప్పక్ పల్లి గ్రామంలో రూ. 64కోట్ల 43 లక్షల 19వేలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకుమంత్రి తన్నీరు హరీశ్ రావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేయనున్నారు. నారాయణపేట పట్టణం నుంచి ఎక్లాస్పూర్ మీదుగా తెలంగాణ కర్ణాటక సరిహద్దు…