రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో.. అలుగునుర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారయణ, మేడిపల్లి సత్యంకు భారీ గజమాలతో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదనంతరం పది సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
Read Also: Pocharam Srinivasa Reddy: ముందున్నది ముసళ్ళ పండుగ.. మాజీ స్పీకర్ హాట్ కామెంట్స్
కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందిన పొన్నం ప్రభాకర్.. తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంటులో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రశ్నార్థకంగా మారిందని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో.. రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడంలో కీలక భూమిక పోషించాడని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు.
Read Also: CM Review: ధరణిపై ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
గత పది సంవత్సరాల తర్వాత కరీంనగర్ లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాయని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన పొన్నం ప్రభాకర్.. కేబినెట్ లో మంత్రి పదవి రావడంతో మొదటిసారిగా కరీంనగర్ కు విచ్చేస్తుండటంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. అంతేకాకుండా.. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం నెలకొంది.