రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 20న విశాఖలో పర్యటించనున్నారు. ఈనెల 20న భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశాఖ చేరుకోనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఆయన నేరుగా నౌకాదళ అతిథి గృహానికి వెళ్లనున్నారు. ఈనెల 21న నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూలో పాల్గొంటారు. తిరిగి ఈనెల 22న ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్…
విశాఖలోని శారదా పీఠం వద్ద మంత్రి అప్పలరాజుకు అవమానం ఎదురైంది. శారదా పీఠం వార్షికోత్సవం సందర్భంగా సీఎం జగన్ విశాఖ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి అప్పలరాజుతో పాటు పలువురు వైసీపీ నేతలు శారదా పీఠం వద్దకు చేరుకున్నారు. సీఎం రాక సందర్భంగా శారదాపీఠంలోకి మంత్రి అప్పలరాజు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఒక్కరే లోపలకు వెళ్లాలని, అనుచరులను లోపలకు పంపించబోమని సీఐ స్పష్టం చేశారు. Read Also: Bonda Uma: సీఎం జగన్ ఇంటిని…
విశాఖ నగర వైస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు తిప్పల నాగిరెడ్డి, వరుదు కళ్యాణి, జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, నియోజకవర్గ సమన్వయ కర్తలు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. జాతీయ జెండాను మంత్రి అవంతి శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి విశాక రావాలంటే ఐదు గంటల సమయం పడుతుందన్నారు.…
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కీలక సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చైర్మన్ సీహెచ్ నరసింగరావు మీడియాతో మాట్లాడారు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఒక్క రోజు కూడా విరామం ఇవ్వకుండా నిరసన దీక్ష చేసిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. దీంతో భవిష్యత్ కార్యచరణపై ఉక్కు పరిరక్షణ పోరాట సమితి దృష్టి పెట్టింది. కరోనా పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్‌కు రూ.700 కోట్ల లాభాలు వచ్చాయని తెలిపారు.…
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో భాగంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మరో అడుగు ముందుకు వేసింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని గత కొన్ని రోజులుగా కోరుతున్నారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన సంగతి తెల్సిందే.. ఈ ఉద్యమానికి రాజకీయ పార్టీలు సైతం మద్దతునిస్తున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు మార్లు ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.…
సంచలనం సృష్టించిన రింగు వలలపై ఘటనపై అధికారులు, మత్స్యకారులతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో ఎలాలంటి నిర్ణయాన్ని అధికారులు తీసుకోలేకపోయారు. దీంతో మత్స్యకారులతో అధికారుల సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఇరు వర్గాల మత్స్యకార గ్రామాల పెద్దలతో చర్చలు జరిపిన జిల్లా ఉన్నతాధికారులు. ఈనెల 25వ తేదీన మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈలోగా ఏదో ఒక నిర్ణయానికి రావాలని మత్స్యకారులను అధికారులు కోరారు.తమ తమ గ్రామ పెద్దలతో చర్చించి 25 లోగా తమ నిర్ణయం తెలుపుతామని…
విశాఖలో చోటు చేసుకున్న మత్స్యకారులు వాగ్వాదానికి సంబంధించి మంత్రుల సమావేశం ముగిసింది. ఈసందర్భంగా ఏపీ మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. అనుమతి ఉన్న 11 రింగు వలల బోట్లలో మూడింటికే ట్రాన్స్ ఫా౦డర్స్ ఉన్నాయి. వాటితో 8కిలోమీటర్ల తరువాత వేట కొనసాగించవచ్చని తెలిపారు. మిగిలిన 8 రింగు వలల బోట్లు ట్రాన్స్‌ఫాండర్స్ ఏర్పాటు చేసుకుని వెళ్లొచ్చిని తెలిపారు. రింగు వలల వివాదం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉందని, మత్స్యకారులు సామరస్యంతో ఉండాలని మంత్రి…
మత్య్సకార సోదరుల మధ్య గొడవ దురదృష్టకరమైన సంఘటన అని ఏపీ పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. సముద్రంలోకి లోపలికి వెళ్లి ఎవ్వరి బోట్లు వారే కాల్చుకుంటామంటే చట్ట ప్రకారం శిక్ష తప్పదని మంత్రి అన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రాకుండా అందరిని కంట్రోల్‌లోకి తీసుకున్నామని మంత్రి తెలిపారు. Read Also: ఉద్యమాన్ని అణిచివేయడానికే…
విశాఖ సముద్రతీరంలో మరసారి రింగు వలల వివాదం తెరపైకి వచ్చింది. పెద్దజాలరిపేట, చిన్న జాలరి పేట మత్స్యకారుల మధ్య వివాదం జరగగా రింగు వలలతో వేటకు వెళ్లిన మత్స్యకారులను మరో వర్గం మత్స్యకారులను అడ్డుకున్నారు. ఇప్పుడు ఈ విషయం పెద్ద చర్చ నడుస్తుంది. తమ బోట్లకు నిప్పుపెట్టారని మరో వర్గానికి చెందిన మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనిపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్.. మాట్లాడుతూ.. బోటు…
విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. విహారం కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన వారిలో సముద్రంలో గల్లంతు అవ్వడం తోటి వారిని కలిచి వేసింది.విహారం కోసం వచ్చిన వారిలో సముద్రంలో మునిగి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఒడిశాకు చెందిన ఐదుగురు బీచ్‌లో స్నానానికి దిగగా వారిలో సునీత త్రిపాఠి అనే యువతి మృతి చెందింది. మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. Read Also: మద్యం సేవించొద్దన్నందుకు వ్యక్తులపై దాడి.. ఒకరు మృతి…