అందాల విశాఖ సాగరతీరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ( TCS) మణిహారంగా మెరవనుంది. మెరుగైన జీతభత్యాలు అందించే 10 వేల ఐటీ ఉద్యోగాలు యువతకు లభించనున్నాయి. యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్, ఏపీకి ప్రఖ్యాత ఐటీ కంపెనీలు రప్పించి లక్షలాది మందికి స్థానికంగా ఉపాధి కల్పిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట నెరవేర్చే దిశగా విశ్వప్రయత్నాలు చేసి టాటా గ్రూపు చైర్మన్, పెద్దలను ఒప్పించి విశాఖకు టీసీఎస్ ని రప్పించారు.
విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి నామినేషన్ వేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్లొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన బస్సు యాత్రకు విశేషమైన స్పందన లభించిందన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 13వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ వైజాగ్ లోని ACA-VDCA స్టేడియానికి వెళ్లనున్నాయి ఇరు జట్లు. ఇక మార్చి 31, ఆదివారం రాత్రి 07:30 కు జరిగే ఈ మ్యాచ్ కు ముందు., చెన్నై, ఢిల్లీ జట్లు మొత్తం 29 మ్యాచ్ లలో తలపడగా.. అందులో 10 మాత్రమే క్యాపిటల్స్ గెలిచింది. మిగితా 19 మ్యాచ్ లలో సూపర్ కింగ్స్ విజయం సాధించింది. Also…
Kiraak RP Married his love intrest Lakshmi Prasanna at Vishakapatnam: జబర్దస్త్ షోలో కిర్రాక్ ఆర్పీ ఓ టీమ్ మెంబర్ గా ఎంటర్ అయి టీమ్ లీడర్ స్థాయి దాకా వెళ్లి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. మామూలు టీమ్ మెంబర్ గా ఎంటర్ అయినా తనదైన పంచులతో తనదైన మార్క్ కామెడీతో అలరిస్తూ టీమ్ లీడర్ అయిపోయాడు. ఇక కిర్రాక్ ఆర్పీ టీమ్ తో చాలా కాలం ప్రేక్షకులను అలరించే వాడు. అయితే తరువాతి…
BlackMail: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. వాళ్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు కీచకులు. నమ్మించి అమ్మాయిల గొంతుకోస్తున్నారు.
Vishaka MP MVV Satyanarayana Family Kidnapped: ఏపీలో కిడ్నాప్ కలకలం రేగింది. ఏకంగా అధికార వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీలను కిడ్నాపర్లు అపహరించారని తెలుస్తోంది. ఈ రోజు ఉదయం రిషికొండలోని ఆయన ఇంట్లోకి దూరిన దుండగులు వారిని కిడ్నాప్ చేశారని చెబుతున్నారు. ఉదయం 6-7 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కిడ్నాప్ జరిగిన సమయంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హైదరాబాద్…
ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 19న విశాఖపట్నంలో వన్డే మ్యాచ్ జరగబోతుంది. ఇక్కడ జరుగుతున్న డే అండ్ నైట్ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను సాయంత్రం 4 గంటల నుంచి ఆన్లైల్లో పెట్టిన ఆరగంటకే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
VandeBharat: విశాఖ-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీసేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 15న ఈ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రైలుకు సంబంధించిన బుకింగ్స్ ఈరోజు నుంచే ప్రారంభం అయ్యాయి. వందే భారత్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయి. ఇందులో రెండు బోగీలు ఎగ్జిక్యూటివ్ కేటగిరీవి. మిగతావి ఎకానమీ కోచ్‌లు.…
Ease Of Living: దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటింది. నివాసానికి సౌకర్యంగా ఉండే పట్టణాల్లో దేశవ్యాప్తంగా టాప్-10లో ఏపీలోని మూడు పట్టణాలు స్థానం సంపాదించాయి. ఈ జాబితాలో గుంటూరు ఆరో స్థానం, విజయవాడ 8వ స్థానం, విశాఖపట్నం 9వ స్థానం దక్కించుకున్నాయి. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సిటిజన్ పర్సెప్షన్ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రజల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. ఈ ర్యాంకుల్లో థానే, బెంగళూరు, భోపాల్…
VandeBharat: ఏపీ, తెలంగాణ మధ్య మరో కొత్త రైలు అందుబాటులోకి రానుంది. ఈనెల 19న ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించబోతున్నారు. ఈ రైలు సికింద్రాబాద్-విశాఖ మధ్య పరుగులు పెట్టనుంది. అయితే సాధారణంగా వందేభారత్ రైలు స్పీడ్ గంటకు 180 కి.మీ.తో వెళ్లాల్సి ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రైలు కేవలం 82.58 కి.మీ. స్పీడ్‌తోనే నడవనుంది. దీనికి కారణం రైల్వే ట్రాక్ అని అధికారులు చెప్తున్నారు. ఇంకా సరైన రీతిలో…