కరోనా పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్‌కు 700 కోట్లు లాభాలు వచ్చాయి: సీహెచ్ నరసింగరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కీలక సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చైర్మన్ సీహెచ్ నరసింగరావు మీడియాతో మాట్లాడారు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఒక్క రోజు కూడా విరామం ఇవ్వకుండా నిరసన దీక్ష చేసిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. దీంతో భవిష్యత్ కార్యచరణపై ఉక్కు పరిరక్షణ పోరాట సమితి దృష్టి పెట్టింది. కరోనా పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్‌కు రూ.700 కోట్ల లాభాలు వచ్చాయని తెలిపారు. 150 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కరోనాతో మృతి చెందారన్నారు. వచ్చే నెల 12 తో నిరసన దీక్షలకు ఏడాది పూర్తవుతుందన్నారు. 365 జెండాలను పట్టుకుని నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. వచ్చే నెల 13న ఉద్యమం ఏడాది పూర్తయిన సందర్భంగా బీజేపీ కార్యాలయ ముట్టడి, ఫిబ్రవరి 23న విశాఖ నగర బంద్‌తో పాటు రాష్ట్రబంద్‌కు పిలుపునిస్తామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడతామన్నారు.
Read Also:భవిష్యత్ కార్యచరణను ప్రకటించిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
స్టీల్ ప్లాంట్ వెనుక 16,500 కుటుంబాల త్యాగం ఉంది: మంత్రి రాజశేఖర్
స్టీల్ ప్లాంట్ వెనుక 16,500 కుటుంబాల త్యాగం ఉందని ఉక్కు పరిరక్షణ పోరాట సమితి మరో చైర్మన్ రాజశేఖర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన పెట్టుబడి తప్ప బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇంత ఉద్యమం జరుగుతుంటే ఐతే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం..లేదా తీసేస్తాం అంటున్నారు.ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ పోరాట స్ఫూర్తి తెలియాలని ఉధృతంగా ఉద్యమిస్తామన్నారు. కరోనా సమయంలో లిక్విడ్ ఆక్సిజన్ అందించాం. దీపం పేరు పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలి అనుకున్నారో ఆ పథకంతోనే బీజేపీ ఆరిపోవడం ఖాయమని మంత్రి రాజశేఖర్ అన్నారు.
Read Also: తెలంగాణకు కేంద్రం శుభవార్త.. మరో 4 జాతీయ రహదారులు మంజూరు
స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకుంటాం: మస్తానప్ప, వై సీఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు
స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లో రక్షించుకుని తీరుతామని వైసీఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు మస్తానప్ప స్పష్టం చేశారు. కేవలం 5వేల కోట్లు పెట్టుబడి పెడితే 3 లక్షల కోట్లుకు కార్మికులు తీసుకుని వెళ్లారు. పెట్టుబడి దారుల పక్షణా బీజేపీ నిలిచినందుకు ఫిబ్రవరి 23, 24 దేశ వ్యాప్త సమ్మె కొనసాగిస్తామన్నారు. ఈ ఉద్యమంతో ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి తీరుతామన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!