రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 20న విశాఖలో పర్యటించనున్నారు. ఈనెల 20న భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశాఖ చేరుకోనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఆయన నేరుగా నౌకాదళ అతిథి గృహానికి వెళ్లనున్నారు. ఈనెల 21న నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూలో పాల్గొంటారు. తిరిగి ఈనెల 22న ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన వివరాలు విశాఖ జిల్లా అధికారులకు అందడంతో వాళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Farmers Killing: లఖింపూర్ ఖేరి ఘటన.. 4 నెలల తర్వాత మౌనం వీడిన మోడీ