అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను ఏటీసీ టైర్స్ కంపెనీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ ప్లాంట్ ప్రారంభోత్సవానికి రావాలని సీఎం జగన్‌ను ఏటీసీ టైర్స్ డైరెక్టర్ తోషియో ఫుజివారా, కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా పాల్గొన్నారు. విశాఖపట్నం అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసీ కేటాయించిన భూమిలో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు…
ఏపీలో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. టైర్-2 నగరాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. ఈ మేరకు విశాఖలో విడతల వారీగా మూడు వేల సీటింగ్ కెపాసిటీ గల క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రతినిధులు వెల్లడించారు. ఇటీవల ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో ఇన్ఫోసిస్ ప్రతినిధులు సమావేశమై క్యాంపస్ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై చర్చించారు. విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటు చేయడంపై మంత్రి గుడివాడ…
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 4న విశాఖ రానున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు జూలై 4న భీమవరం వస్తున్న నరేంద్ర మోదీ అదే రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు తెల్లదొరల మీద అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. ఆయన విశాఖ మన్యం బెబ్బులిగా మారి నాటి బ్రిటిష్ దొరల మీద భయంకరమైన యుద్ధం…
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. వాల్తేర్ డివిజన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈనెల 6న సోమవారం నాడు విజయవాడ-విశాఖ మార్గంలో ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దు చేసిన రైళ్లలో కాకినాడ పోర్ట్-విశాఖపట్నం (రైలు నంబర్ 17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు (రైలు నంబర్ 17268), విజయవాడ-కాకినాడ పోర్టు (రైలు నంబర్ 17257), కాకినాడ పోర్టు-విజయవాడ (రైలు నంబర్ 17258), విజయవాడ-రాజమండ్రి (రైలు నంబర్ 07768),…
ఐపీఎల్ తర్వాత టీమిండియా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లతో బిజీ బిజీగా గడపనుంది. తొలుత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ పాల్గొననుంది. ఈనెల 9 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 ఢిల్లీలో, రెండో టీ20 కటక్‌లో, మూడో టీ20 విశాఖలో, నాలుగో టీ20 రాజ్‌కోట్‌లో, ఐదో టీ20 బెంగళూరులో జరగనున్నాయి. అయితే ఈనెల 14న విశాఖలో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కు యమా క్రేజ్ ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన…
దావోస్ పర్యటన వివరాల గురించి ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం సాయంత్రం విశాఖలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలనే తాము దావోస్‌కు వెళ్లామని తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దావోస్‌లో వివరించామని.. సుమారు 50 ఎమ్మెన్సీ కంపెనీలతో చర్చలు జరిగినట్లు ఆయన వివరించారు. అయితే విశాఖ ఇమేజ్‌ను ప్రపంచ స్థాయిలో ఎంతగా దెబ్బతీయాలో కొందరు అంత ప్రయత్నం చేశారని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. Chandra…
విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో మరో అధునాతన ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తడి చెత్త, పొడి చెత్తల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను కాపులుప్పాడ డంపింగ్ యార్డులో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టును సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ ప్లాంట్ అధికారికంగా ప్రారంభం కాకపోయినా ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదన మాత్రం కొనసాగుతోంది. ప్రతిరోజూ ఈ ప్రాజెక్టు నుంచి 15 మెగావాట్ల విద్యుత్…
విశాఖలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో బుధవారం సాయంత్రం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే నెల 14వ తేదీన విశాఖలో నిర్వహించనున్న భారత్-దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్‌పై చర్చించారు. విశాఖలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా విశేషమైన స్పందన లభిస్తోందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ గోపీనాథ్‌రెడ్డి వెల్లడించారు. విశాఖలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం 27 వేల మంది కెపాసిటీని కలిగి ఉందని.. ఈ మ్యాచ్‌కు తాము పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతిస్తామని స్పష్టం…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటు కానుంది. బయో డైవర్సిటీ పార్క్ ఏర్పాటు చేసి ప్రజల్లో పర్యావరణం పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి దశలో విశాఖ, కాకినాడ, తిరుపతి, కడపలో నాలుగు బయో డైవర్సిటీ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒక్కో పార్కుకు రూ.కోటి, మ్యూజియానికి రూ.50 లక్షల చొప్పున జీవవైవిధ్య మండలి మంజూరు…