ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. విదేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువ నమోదు అవుతుండటంతో ఇప్పటికే అంతర్జాతీయ విమానాలపై అధికారులు నిషేధం విధించారు. అయితే డిసెంబర్ 1 తర్వాత కేవలం 10 రోజుల వ్యవధిలో ఏపీకి 12,500 మంది విదేశీయులు రావడంతో ప్రజల్లో ఒమిక్రాన్ వైరస్ భయాందోళనలు ప్రారంభమయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో అత్యధికంగా విశాఖ జిల్లా వారే ఉన్నట్లు అధికారులు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. Read Also: కరోనా అంతంపై…
త్వరలో ఏపీకి విశాఖ నగరం ఏకైక రాజధాని అయ్యే అవకాశాలున్నాయి. వచ్చే ఉగాదికి ఈ విషయంపై క్లారిటీ రానుంది. అయితే ఆలోపు విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని జగన్ సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. విశాఖ నగరంలో స్నో పార్క్ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. విశాఖలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2 ఎకరాల్లో రూ.20 కోట్ల అంచనా వ్యయంతో ఈ…
మరోరెండు రోజులు ఏపీలో వర్షాలుబంగాళాఖాతంలోని అల్ప పీడనం కొనసాగుతుంది. జవాద్ తుఫాన్ ఒడిశాలోని పూరికి సమీపంలో బలహీనపడి తీరాన్ని దాటింది. అయితే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో అల్పపీడనం వాయుగుండంగా మారి బలహీన పడుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొన్నదని దీని ఫలితంగా మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జవాద్ తుఫాన్ బలహీన పడటంతో…
విశాఖలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రకాష్ నగర్‌లో రౌడీ షీటర్ దోమాన చిన్నారావును స్థానిక మహిళలు చితకబాదారు. స్కూల్‌కు వెళ్లే అమ్మాయిలకు పెన్నులు, పెన్సిళ్లు ఇస్తూ చిన్నారావు వారికి ఆశ చూపించాడు. దీంతో కొందరు విద్యార్థినులు చిన్నారావు మాటలు నమ్మి అతడి దగ్గరకు వెళ్లారు. కానీ ఇదే అదనుగా భావించిన చిన్నారావు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో స్థానిక మహిళలందరూ కలిసి…
జవాద్ తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు తుఫాన్ సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అయితే తాజాగా జవాద్ తుఫాన్ నేపథ్యంలో డిసెంబర్ 5న జరగాల్సిన జాతీయ ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. యూజీసీ నెట్ పరీక్షతో పాట ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రెడ్, ఎంబీఏ అడ్మిషన్లకు నిర్వహించే ఎగ్జామ్స్ సైతం వాయిదా పడింది. విశాఖ, పూరి, బెర్హంపూఐర్, కటక్, గుణుపూర్, భువనేశ్వర్…
బంగాళాఖాతంలో జవాద్ తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర తీరం వద్దకు దూసుకువస్తోంది. ఉత్తర దిశగా కదులుతూ ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీరం దాటిన తర్వాత బంగాళాఖాతం వైపు వెళ్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజులు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 80-100 కి.మీ. వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన…
దేశంలో అత్యంత విషాద ఘటనగా, అతి పెద్ద పారిశ్రామిక విపత్తుగా భోపాల్ గ్యాస్ దుర్ఘటన నిలిచింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) పురుగు మందుల ప్లాంట్‌లో గ్యాస్ దుర్ఘటన జరిగి (1984) నేటికి 37 ఏళ్ళు. సుమారు 8000 మందికి పైగా మృతి చెందగా 5 లక్షలకు పైగా జనాభా దీని ప్రభావానికి లోనయ్యారని ఒక అంచనా! భోపాల్ దుర్ఘటనకు యూనియన్ కార్బైడ్ యాజమాన్య నిర్లక్ష్యం, భద్రతా లోపాలే కారణమని అనేక…
ఏపీ ప్రజలను మరో తుఫాన్ హడలెత్తిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ మారి ఏపీ వైపు దూసుకొస్తోంది. విశాఖకు 670 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ దిశగా కదులుతోంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలలో క్రమంగా వాతావరణం మారుతోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలలో అలజడి మొదలైంది. ఈదురుగాలుల తాకిడి కూడా పెరుగుతోంది. గంటకు 45 నుంచి 50 కి.మీ. మేర వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తా,…
బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర తుఫానుగా మారనుంది. ప్రస్తుతం వాయుగుండం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 960 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని… ఇది డిసెంబర్ 4న వేకువజామున ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్‌కు అధికారులు జవాద్ అని నామకరణం చేశారు. జవాద్ తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వాసులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. జవాద్ తుఫాన్ ప్రభావంతో…
విశాఖ సముద్ర తీరంలోని తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకుని వచ్చిన బంగ్లాదేశ్ వాణిజ్య నౌక ఎం. వీ.మాను మంత్రి అవంతి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.ఈ నౌకను ఫ్లోటింగ్ రెస్టారెంట్ గా మార్చాలని నిర్ణయించారు. దీంతో పనులు జరుగుతున్న తీరును మంత్రి అవంతి పరిశీలించారు. పీపీపీ పద్ధతిలో గిల్‌మైరైన్ కంపెనీతో కలిసి ఈ షిప్‌ను రెస్టారెంట్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎం.వీమా ను డిసెంబర్ 29 నాటికి పర్యాటక ప్రదేశంగా తయారు చేస్తామని…