విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో భాగంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మరో అడుగు ముందుకు వేసింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని గత కొన్ని రోజులుగా కోరుతున్నారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన సంగతి తెల్సిందే.. ఈ ఉద్యమానికి రాజకీయ పార్టీలు సైతం మద్దతునిస్తున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు మార్లు ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులు ఆందోళనలకు సైతం మద్దుతు నిచ్చారు. అటు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆపడం లేదంటూ పలు మార్లు పవన్ ప్రశ్నించారు. టీడీపీ సైతం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపాలని కోరాయి.
Read Also: తిరుమలలో ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు
కేంద్రం దిగి రాకపోవడంతో భవిష్యత్ కార్యచరణను ప్రకటిచిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ. ఫిబ్రవరి 13న విశాఖలో ఉన్న బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపు నిచ్చిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ. ఫిబ్రవరి 23న విశాఖ నగరం బంద్‌కు పిలుపునిచ్చారు. అంతే కాకుండా విడతల వారీగా ఉద్యమాలు చేపడతామని వారు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి 365 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఇక పోరాటాలకు సిద్ధం కావాలని ఉద్యోగులు నిర్ణయించారు. మరో వైపు ఎన్ని ప్రయత్నాలు చేసిన కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని స్పష్టం చేయడంతో ఇక పోరాటాలతోనే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకుంటామని ఉద్యోగులు చెబుతున్నారు.