జవాద్ తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు తుఫాన్ సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అయితే తాజాగా జవాద్ తుఫాన్ నేపథ్యంలో డిసెంబర్ 5న జరగాల్సిన జాతీయ ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. యూజీసీ నెట్ పరీక్షతో పాట ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రెడ్, ఎంబీఏ అడ్మిషన్లకు నిర్వహించే ఎగ్జామ్స్ సైతం వాయిదా పడింది. విశాఖ, పూరి, బెర్హంపూఐర్, కటక్, గుణుపూర్, భువనేశ్వర్ సెంటర్లలో పరీక్షా ఉండదని NTA తెలిపింది. మిగతా సెంటర్లలలో యథావిధిగా పరీక్ష ఉంటుందని తెలిపింది.
కొత్త పరీక్షల తేదిలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. ఇదిలా ఉంటే తుఫాన్ ప్రభావం అంతగా ఉండక పోవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 6 కీ.మీ వేగంతో వాయగుండం బలహీన పడుతుందని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఒకవేళ భారీ ఎత్తున తుఫాన్ వస్తే ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేసింది.