ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న జవాద్ తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైయింది. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అధికారులకు, ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈనెల మూడో తేది నుంచి మూడు రోజులపాటు పర్యాటక ప్రదేశాలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తుఫాన్ తీవ్రత తగ్గే వరకు సందర్శకులు రావొద్దని సూచించింది. మత్స్యకారుల వేటకు వెళ్లడంపైన నిషేధం విధించారు. ఆయా ప్రాంతాల్లో కంట్రోల్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) రూ.120 కోట్ల జరిమాన విధించింది. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని ఎన్‌జీటీ ఈ జరిమానా విధించింది. మొత్తం రూ. 120 కోట్లను కట్టాలని ఎన్‌జీటీ పేర్కొంది. కాగా ఇ్పపటికే ఈ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం వేగవంతంగా పనులను చేపడుతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే అటు ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాలలకు తాగునీటి కష్టాలు తీరుతాయి.…
విశాఖ నగరంలోని పరవాడ ఫార్మాసిటీలో సోమవారం ఉదయం గ్యాస్ కలకలం రేపింది. వ్యర్థ జలాల పంప్ హౌస్‌లో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. బాధితులను పాయకరావుపేటకు చెందిన మణికంఠ (25), దుర్గాప్రసాద్ (25)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. Read Also: భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలెర్ట్.. కాగా విశాఖలో గ్యాస్ లీక్ ఘటనలు తరచూ చోటుచేసుకోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు.…
ఏపీ, తెలంగాణలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,140గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040గా పలుకుతోంది. వెండి కూడా పసిడి బాటలో స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ.700 తగ్గి ప్రస్తుతం రూ.67,200గా నమోదైంది. అటు విజయవాడలో 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,140గా.. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ.45,040గా నమోదైంది. కిలో వెండి…
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి గుండెపోటుతో సోమవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే ఆయన కన్నుమూశారని సన్నిహితులు వెల్లడించారు. డాలర్ శేషాద్రి విశాఖలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లగా ఈ ఘటన జరిగింది. 1978వ సంవత్సరం నుంచి శ్రీవారి సేవలో డాలర్ శేషాద్రి పాల్గొంటున్నారు. 2007లో రిటైర్మెంట్ అయినా….శేషాద్రి సేవలు టీటీడీకి తప్పనిసరి కావడంతో ఓఎస్‌డీగా కొనసాగుతున్నారు. మరణించే చివరి క్షణం వరకు శ్రీవారి సేవలో ఆయన తరించారు. కాగా డాలర్…
విశాఖ నగరంలో ఆదివారం తెల్లవారుజామున పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మధురానగర్, బీచ్ రోడ్డు, మురళీనగర్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, అల్లిపురం, తాటిచెట్లపాలెం, బంగారమ్మపేట, జ్ఞానాపురం, తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. అందరూ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా సమాచారం తెలుసుకున్న అధికారులు భూప్రకంపనలకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు. Read Also: నాలుగు రాష్ట్రాలలో…
సికింద్రాబాద్-విశాఖ మధ్య ప్రత్యేకరైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఈ నెల 17, 24 తేదీల్లో స్పెషల్ రైళ్లు తిరగనున్నాయి. ఆయా తేదీల్లో రాత్రి 9:05 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 9:50 గంటలకు విశాఖ చేరుతుంది. అలాగే విశాఖలో ఈ నెల 16, 23 తేదీల్లో సాయంత్రం 5:35 గంటలకు బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 7:10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. స్పెషల్ రైళ్లకు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి,…
చేపల వేటకు వెళ్లి నలుగురు మృతి చెందిన ఘటన విశాఖ ఏజెన్సీలోని జీకే వీధి మండలం చాపరాజు పాలెంలో చోటుచేసు కుంది. చేపల వేట నిమిత్తం సమీపంలోని బొంతు వలస గడ్డవద్దకు వెళ్లిన గిరిజనులు ప్రమాద వశాత్తు నీటిలో మునిగిపోయారు. మృతి చెందిన వారిని జీకే వీధి మండలంలోని చాప రాజు పాలెం గ్రామనికి చెందిన గడుతూరి నూకరాజు (35) గడుతూరి తులసి (9) గడుతూరి లాస్య (10) రమణబాబుగా గుర్తించారు. ముగ్గురు మృతదేహలు లభించాయి. రమణబాబు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శనివారం నాడు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి కూడా జగన్ హాజరుకానున్నారు. ధర్మశ్రీ కుమార్తె వివాహం విశాఖ నగరంలోని ఎంజీఎం పార్కులో వైభవంగా జరగనుంది. ఈ పెళ్లికి సీఎం జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. కాగా అంతకుముందు విశాఖ నగరంలో పలు అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. Read Also: సమంత పరువునష్టం కేసు తీర్పు వాయిదా సీఎం జగన్ తొలుత…
టీడీపీ అధినేత చంద్రబాబు చూడని రాజకీయం.. చూడని ఎత్తుపల్లాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఎక్కువ కాలం పని చేసిన ఘనత చంద్రబాబుకు ఉంది. అలాగే రాష్ట్ర విభజన తర్వాత కూడా నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొత్త రికార్డు సృష్టించారు. అలాంటి చంద్రబాబు తన రాజకీయం జీవితంలో ఎన్నడూ లేనివిధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కనీసం సొంత నియోజకవర్గంలోనూ పార్టీని గాడినపెట్టలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తుంది.…