టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ కాసేపటి కిందట సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అయితే విరాట్ కోహ్లీ ప్రకటనపై ఏపీలోని చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ స్పందించారు. ఇలాంటి వార్తను కచ్చితంగా ఇప్పుడు తాము వినాలనుకోలేదని ఎమ్మెల్యే విడదల రజనీ అభిప్రాయపడ్డారు. కానీ కోహ్లీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని తెలిపారు. Read Also: బిగ్ బ్రేకింగ్: టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై..!! భారత క్రికెట్‌కు విరాట్ కోహ్లీ అందించిన…
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం నాడు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఏడేళ్లుగా తాను టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించానని.. ప్రస్తుతం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఏడేళ్లుగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపాడు. కెప్టెన్‌గా జట్టుకోసం సర్వశక్తులు ధారపోశానని… ఎంతో నిజాయతీగా వ్యవహరించానని కోహ్లీ తెలిపాడు. ప్రతి దానికి ఏదో…
దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా విరాట్ కోహ్లీ వివాదంలో ఇరుక్కున్నాడు. కేప్‌టౌన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ నాటౌట్‌కు సంబంధించి డీఆర్ఎస్ విషయంలో విరాట్ కోహ్లీ స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి ప్రసార కర్తలను ఉద్దేశించి మాట్లాడిన తీరు వివాదానికి దారి తీసింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ కోహ్లీపై విమర్శలు చేశాడు. కోహ్లీకి భారీ జరిమానా విధించాలని… అంతేకాకుండా కోహ్లీ నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. ఆటలో క్రికెటర్లు…
కేప్‌టౌన్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. మళ్లీ భారత ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ 10 పరుగులు, మయాంక్ అగర్వాల్ 7 పరుగులు మాత్రమే చేశారు. 24 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోవడంతో పుజారా, విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడారు. పుజారా 31 బంతుల్లో 9 పరుగులతో, కోహ్లీ 39 బంతుల్లో 14 పరుగులతో క్రీజులో…
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది.. సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు.. ప్రస్తుతం కేప్‌టౌన్ వేదికగా ఆ దేశంతో మూడో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే కాగా.. ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఓ అరుదైన రికార్డు సృష్టించాడు.. దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో రెండో ఆటగాడిగా రికార్డు కెక్కాడు.. ఈ లిస్ట్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 15 మ్యాచ్‌లలో 1,161 పరుగులతో…
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 223 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (79) ఒంటరి పోరాటం చేశాడు. సెంచరీ చేసేలా కనిపించిన కోహ్లీ.. మరోసారి అవుట్‌సైడ్ ఎడ్జ్‌తో రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్‌లో పుజారా (43), రిషబ్ పంత్ (27) తప్ప ఎవరూ రాణించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ 4 వికెట్లు, మాక్రో జాన్సన్ 3 వికెట్లతో సత్తా చాటారు. Read Also: అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్…
సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా.. ఆ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది.. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1 తేడాతో రెండు జట్లు సమానంగా ఉండగా.. ఇవాళ కేప్‌టౌన్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు భారత్-సౌతాఫ్రికా మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడనుండడం భారత్‌కు కలిసివచ్చే అవకాశంగా చెప్పుకోవాలి.. అయితే, కండరాల గాయంతో మూడో టెస్ట్‌కు సిరాజ్ దూరం అయ్యాడు.. సిరాజ్…
దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా మంగళవారం నుంచి జరగనున్న మూడో టెస్టులో టీమిండియా తలపడనుంది. ఇరు జట్లకు ఇది కీలకమైన టెస్ట్ మ్యాచ్. ఇందులో గెలిచిన జట్టుకు సిరీస్ సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు కూర్పుపై క్లారిటీ ఇచ్చాడు. కేప్‌టౌన్ టెస్టుకు తాను సిద్ధంగా ఉన్నానని… ఫిట్నెస్ కూడా ఉందని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. అయితే రెండో టెస్టులో గాయపడ్డ సిరాజ్… మూడో టెస్టుకు సిద్ధంగా లేడని కోహ్లీ స్పష్టం…
టీమిండియా టెస్ట్ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ త్వరలోనే అరుదైన మైలురాయిని చేరబోతున్నాడు. టెస్టు కెరీర్లో అతడు వందో టెస్టును ఆడనున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో మూడో టెస్ట్ ఆడితే 99వ టెస్టు ఆడనున్న కోహ్లీ… సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే సిరీస్‌లో 100వ టెస్టు మజిలీకి చేరుకోనున్నాడు. ఆ టెస్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోతోంది. సుదీర్ఘ కాలంలో ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సేవలు అందిస్తున్న కోహ్లీ… తన వందో టెస్టును బెంగళూరులో…
టీమిండియాలో గత కొంతకాలంగా జరుగుతోన్న పరిణామాలపై అనేక రకాల ప్రచారం జరిగింది.. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత.. బీసీసీఐ, టీమిండియాలోని కొందరు ఆటగాళ్లతో విరాట్ కోహ్లీకి విబేధాలు ఉన్నాయంటూ పుకార్లు షికార్లు చేశాయి.. అయితే, ఈ పుకార్లపై తాజాగా స్పందించారు భారత జట్టు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ… విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు నెలకొన్నాయన్న ప్రచారాన్ని కొట్టిపారేసిన ఆయన.. ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నారు.. అవన్నీ పనిలేని వ్యక్తులు…