భారత క్రికెట్లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సోమవారం నుంచి జోహన్నెస్ బర్గ్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఏడు పరుగులు చేస్తే జోహన్నెస్ బర్గ్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా నిలవనున్నాడు. Read Also: క్రిస్ గేల్‌కు షాకిచ్చిన వెస్టిండీస్ బోర్డు రెండో టెస్టుకు ఆతిథ్యం ఇవ్వబోతున్న జొహనెస్‌బర్గ్ వేదికలో విరాట్ కోహ్లీకి తిరుగులేని రికార్డు ఉంది.…
టెస్ట్ ఫార్మాట్‌కు సంబంధించి 2021కి టీమిండియా ఘనంగా వీడ్కోలు పలికింది. భారత్ ఈ ఏడాది 14 టెస్టులు ఆడగా… అందులో 8 విజయాలు, మూడు పరాజయాలు ఉన్నాయి. మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత్… అక్కడ నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో చేజిక్కించుకుంది. అయితే జూన్ నెలలో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐసీసీ…
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. ఇప్పటికే భారత జట్టుకు అత్యధిక టెస్టు విజయాలు అందించిన కెప్టెన్‌గా ఘనత అందుకున్న కోహ్లీ తాజాగా దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ద్వారా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు టాస్ గెలిచిన కెప్టెన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ.. ఇప్పటివరకు మొత్తం 68 టెస్టులకు 30 మ్యాచ్‌ల్లో టాస్ నెగ్గాడు. దీంతో…
టీమిండియాకు దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. సచిన్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్, ధోనీ వంటి దిగ్గజాల నేతృత్వంలో కూడా భారత్ టెస్ట్ సిరీస్ సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు టీమిండియాను సువర్ణావకాశం ఊరిస్తోంది. ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటే ఈసారి సిరీస్ సాధించొచ్చని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా ఆడిన మూడు టెస్టుల్లో ఒక్కసారి మాత్రమే 250 ప్లస్ స్కోరు చేసిందని.. అందుకే ఆ సిరీస్…
బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ మధ్య విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించి.. టీ20 కెప్టెన్ గా తప్పుకోవద్దు అని నేను కోహ్లీకి చెప్పను. కానీ వినలేదు. దాన్తజో వైట్ బల్ ఫార్మటు లో ఇద్దరు కెప్టెన్ లు ఉండకూడదు అని కోహ్లీని వన్డే కెప్టెన్ గా తప్పించారు. అయితే టీ20 కెప్టెన్ గా తప్పుకోవద్దు అని దాదా తనకు చెప్పలేదు…
టీమిండియా కోచ్‌గా…రవిశాస్త్రి ఉన్నంత కాలం…రన్‌మిషిన్ కోహ్లీ కు ఎదురులేదు. రవిశాస్త్రి హయాంలో…టీమిండియాకు కోహ్లీ చెప్పిందే వేదం. ఎన్నో టెస్టు సిరీస్‌లు, వన్డేలు, టీ20లు ఆడినా…రవిశాస్త్రి నుంచి కోహ్లీ సలహాలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ. సెంచరీ చేసి రెండేళ్లయినా…ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడన్న దానిపై దృష్టి పెట్టలేదు రవిశాస్త్రి. విదేశాలతో పాటు స్వదేశంలో జరిగిన టెస్టుల్లోనూ మంచి స్కోర్లు సాధించలేకపోయాడు కోహ్లీ. ఎక్కడ లోపముందో…చెప్పే ప్రయత్నం చేయలేకపోయాడు రవిశాస్త్రి. ప్రస్తుతం టీమిండియా క్రికెట్లో పరిస్థితి మారిపోయింది. దక్షిణాఫ్రికాతో టెస్టు…
ప్రస్తుతం భారత క్రికెట్ లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అలాగే విరాట్ కోహ్లీకి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దు అని తాను చెప్పినట్లు గంగూలీ ప్రకటించగా… ఆ వ్యాఖ్యలను కోహ్లీ కొట్టిపారేశారు. దాంతో వీరిద్దరి మధ్య వివాదం బయటకు వచ్చింది. అయితే తాజాగా గంగూలీ కోహ్లీని ప్రశంసించారు. ఇక తాజాగా జరిగిన ఒక ఈవెంట్లో గంగూలీని… మీకు ఏ ఆటగాడి వ్యక్తిత్వం అంటే…
ప్రస్తుతం భారత క్రికెట్ లో కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సౌరవ్ గంగూలీ వ్యాఖ్యలకు విరాట్ కోహ్లీ విరుద్ధంగా మాట్లాడటంతో అది మరింత ముదిరింది. అయితే టీ20 కాప్రిన్సీ నుంచి తప్పుకోవద్దని తాను కోహ్లీకి చెప్పినట్లు గంగూలీ ప్రకటించగా… తనకు అలాంటిది ఏం చెప్పలేదు అని విరాట్ అన్నారు. అయితే తాజాగా గంగూలీ… విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యల పై మాట్లాడేందుకు నిరాకరించారు. నేను దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్లవద్దు అని అనుకుంటున్నాను. కాబట్టి…
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. విరాట్ కోహ్లీ మధ్య గొడవ.. దేశ క్రికెట్‌కు మంచిది కాదని సూచిస్తున్నారు సీనియర్లు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లేందుకు…ఇలా గొడవ పడితే…దీని ప్రభావం ఆటగాళ్లపై పడుతుందని అంటున్నారు. దక్షిణాఫ్రికా లాంటి కీలక విదేశీ పర్యటనలకు ముందు గొడవలు జరిగితే…ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపిస్తుందన్నారు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్. బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి ఎంత గొప్పదో.. టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడం కూడా అంతే గొప్ప విషయమన్నారు. బహిరంగంగా పరస్పరం చెడుగా మాట్లాడుకోవడం.. మంచి…
ప్రస్తుతం టీమిండియాలో విరాట్ కోహ్లీ-గంగూలీ ఎపిసోడ్ హాట్‌టాపిక్‌గా మారింది. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంపై విరాట్ కోహ్లీ అసంతృప్తిగా ఉన్నాడనే విషయం అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తనకు చెప్పకుండా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని.. టీ20 కెప్టెన్సీకి తాను రాజీనామా చేసినప్పుడు తనకు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒకే కెప్టెన్ ఉండాలనే విషయం చెప్పలేదని కోహ్లీ చెప్పడంతో వివాదం చెలరేగింది. మరోవైపు విరాట్ కోహ్లీని టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని చెప్పినా వినలేదని గతంలో గంగూలీ చెప్పిన…