IND Vs WI: కోహ్లీ.. రోహిత్.. ఈరోజు చరిత్ర సృష్టించేది ఎవరో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య కోల్‌కతా వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించడానికి చేరువలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఈరోజు జరిగే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ పేరు మీద ఉంది. ఇప్పటివరకు అతడు 112 మ్యాచ్‌లు ఆడి 3,299 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
మార్టిన్ గప్తిల్ రికార్డును అధిగమించడానికి ఈరోజు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరో 56 పరుగులు చేయాల్సి ఉంటుంది. కోహ్లీ ఇప్పటివరకు 96 మ్యాచ్‌లు ఆడి 3,244 పరుగులు చేశాడు. ఇందులో 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు గప్తిల్ రికార్డును రోహిత్ శర్మ అధిగమించాలంటే 63 పరుగులు చేయాలి. రోహిత్ ఇప్పటివరకు 120 మ్యాచ్‌లు ఆడి 3,237 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. శుక్రవారం రాత్రి జరిగే మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్‌లో ఎవరో ఒకరు లక్ష్యాన్ని చేరుకుంటే గప్తిల్ రికార్డు బద్దలు అవుతుంది. దీంతో ఇవాళ్టి మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Also Read
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
- Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
-
Story Board : డీలిమిటేషన్‌పై కేంద్రం వ్యూహమేంటి..? సర్కారు ఎలాంటి ఫార్ములా తీసుకొస్తుంది..?
-
Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
-
The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. ‘ది పారడైజ్’ బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
-
Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!