త్వరలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టోర్నీలో అడుగుపెట్టబోతున్న రెండు కొత్త ఫ్రాంచైజీలపై అందరి దృష్టి నెలకొని ఉంది. అయితే ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏ జట్టుతో ఉంటాడో అని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ అంశంపై కోహ్లీ స్పందించాడు. తనను వేలంలో పాల్గొనమని చాలా ఫ్రాంచైజీలు కోరుతున్నాయని.. కానీ తాను మాత్రం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్తోనే ఉంటానని కోహ్లీ స్పష్టం చేశాడు. 8 సంవత్సరాల పాటు ఆర్సీబీకి సారథ్యం…
టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో ప్రచారం జరిగింది. 2017లో అనిల్ కుంబ్లేను కోచ్ పదవి నుంచి బీసీసీఐ తప్పించింది. అప్పట్లో ఈ వ్యవహారం ఎంత వివాదం సృష్టించిందో తెలిసిందే. 2016లో భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన కుంబ్లే.. రెండేళ్ల కాలం పూర్తవకుండానే ఏడాది తర్వాత తన పదవికి రాజీనామా చేశాడు. కెప్టెన్‌కు తన పద్ధతులతో ఇబ్బందిగా ఉందని తెలిసిందంటూ కుంబ్లే స్వయంగా వెల్లడించడంతో…
దక్షిణాఫ్రికా గడ్డపై వరుస పరాజయాలతో డీలా పడ్డ టీమిండియా.. త్వరలో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రానున్నాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్.. ప్రస్తుతం పూర్తి కోలుకుని ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. రోహిత్ బుధవారం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫిట్నెస్ పరీక్షకు హాజరుకానున్నాడు. ఆ తర్వాతే సెలక్షన్…
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల కుమార్తె వామిక పిక్ ఎట్టకేలకు లీక్ అయ్యింది. 2021 జనవరి 11న వామిక జన్మించగా, అప్పటి నుంచి పాప విషయంలో గోప్యతను పాటిస్తున్నారు. వామికతో కలిసి ఉన్న ఫోటోలను విరుష్క దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేసినా ఆమె ముఖం మాత్రం కన్పించకుండా జాగ్రత్త పడుతున్నారు. బయట ఎక్కడైనా కనిపించినా ఫోటోగ్రాఫర్లకు కూడా ఫోటోలు వద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. “సోషల్ మీడియాకు దూరంగా తన జీవితాన్ని స్వేచ్ఛగా…
దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత జట్టుకు షాకుల మీద షాకులు తగిలాయి. టెస్టు సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా… ఆదివారం జరిగే నామమాత్రపు మూడో వన్డేలో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి రెండు వన్డేల్లో విఫలమైన ఆటగాళ్ల స్థానంలో వేరేవాళ్లకు చోటు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి రెండు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా భారత జట్టు ఓటమిలో కీలకపాత్ర పోషించిన భువనేశ్వర్‌పై వేటు వేసి.. అతడి స్థానంలో…
టీమిండియా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ఫార్మాట్లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడి నిలిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఈ రికార్డు అందుకున్నాడు. దాంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. విదేశాల్లో సచిన్ వన్డేల్లో 5,065 పరుగులు చేయగా… విరాట్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.…
దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య వన్డే సిరీస్‌కు తెర లేచింది. పార్ల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ వన్డే సిరీస్‌లో టీమిండియాకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకున్న తర్వాత తొలిసారిగా ఈ వన్డే సిరీస్‌లో ఓ సాధారణ ఆటగాడిగా కోహ్లీ ఆడబోతున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు తొలి వన్డే, ఈనెల 21న రెండో వన్డే, 23న మూడో వన్డే జరగనున్నాయి.…
టీమిండియా స్టార్ ఆటగాడు, రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో ఈరోజు నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ మరో 26 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్, గంగూలీ, ద్రవిడ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. Read Also: ఐపీఎల్: అహ్మదాబాద్ కెప్టెన్‌గా…
టీమ్ ఇండియా సారధిగా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌కు శనివారం తెరపడింది. కాదు, తనకు తాను తెర దించాడు. ఆయన నాయకత్వంలో టీంఇండియా ప్రతిభతో నభూతో నభవిష్యత్ అనే రీతిలో విజయపథంలో పరుగులు తీసింది. భారత క్రికెట్ అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా చేసిన అతిరథ మహారధుడు విరాట్ కోహ్లీ. ఏ ఆటలో అయినా విజయవంతమైన ఆటగాళ్లకు తమదైన ఓ ముద్ర ఉంటుంది. జట్టు సారధికి కూడా తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఆటగాడిగా, కెప్టెన్ గా భారత క్రికెట్‌పై కోహ్లీ…
భారత క్రికెట్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శకం ముగిసింది. గత ఏడాది టీ20లు, వన్డేలకు సంబంధించి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ.. తాజాగా టెస్టులకు కూడా గుడ్ బై చెప్పేశాడు. అయితే ఇది అనూహ్య నిర్ణయం. కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. అయితే కోహ్లీ నిర్ణయంపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. ‘ఇది పూర్తిగా విరాట్ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని బీసీసీఐ ఎంతో గౌరవిస్తుంది. విరాట్ సారథ్యంలో అన్ని ఫార్మాట్లలో భారత…