Cricket: విరాట్ కోహ్లీ స్థానానికి శ్రేయాస్ అయ్యర్ ఎసరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్‌లో ఉన్నాడు. గత రెండేళ్లుగా అతడి కెరీర్‌లో సెంచరీ అనేది లేదు. అయినా అతడు కెప్టెన్ కాబట్టి ఇన్నాళ్లూ జట్టులో కొనసాగుతూ వచ్చాడు. ఇప్పుడు కెప్టెన్సీ కూడా పోయింది. కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత కోహ్లీ బ్యాటింగ్‌లో మార్పు వస్తుందని చాలా మంది ఆశించారు. కానీ అతడి బ్యాటింగ్‌లో మునుపటి వాడి, వేడి లేవనే విషయం మాత్రం అర్థమవుతోంది. అడపాదడపా కష్టపడి హాఫ్ సెంచరీలు కొడుతున్నా అవి సాధికారిక ఇన్నింగ్స్‌లు అయితే కావు.
కానీ ప్రస్తుతం శ్రీలంక సిరీస్‌కు కోహ్లీ తప్పుకోవడంతో సెలక్టర్లు శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశమిచ్చారు. వచ్చిన అవకాశాన్ని శ్రేయాస్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో మూడు హాఫ్ సెంచరీలు చేసి సత్తాచాటాడు. ఈ మూడు అల్లాటప్పా ఇన్నింగ్స్‌లు కాదు. ఓపెనర్లు విఫలమైన వేళ క్రీజులోకి వచ్చి దూకుడుగా ఆడి జట్టుకు విజయాలు కట్టబెట్టిన ఇన్నింగ్స్. అందుకే శ్రీలంకతో సిరీస్‌లో శ్రేయాస్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. వరుసగా 57, 74, 73 స్కోర్లతో దుమ్మురేపాడు. టెస్ట్ సిరీస్ పక్కన బెడితే.. వచ్చే ఐపీఎల్‌లో కోహ్లీ ఆడకుంటే భవిష్యత్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి స్థానాన్ని శ్రేయాస్ అయ్యర్ ఆక్రమించడం ఖాయంగా కనిపిస్తోంది. అటు ఇదే స్థానానికి సూర్యకుమార్ యాదవ్ కూడా పోటీలో ఉన్నాడు. సో విరాట్ కోహ్లీ అప్రమత్తంగా ఉండి ఫామ్‌ను అందుకోకుండా జట్టులో అతడి ప్లేస్ గల్లంతైనా కావొచ్చు.
Also Read
- Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
- Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
- Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
- BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
తాజావార్తలు
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్‌లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్‌డ్రాయల్‌పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!