భారత క్రికెట్ నియంత్రణ మండలి వార్షిక కాంట్రాక్టులు జాబితాను విడుదల చేసింది. తాజాగా విడుదలైన ఈ జాబితాలో మాజీ టెస్ట్ కెప్టెన్ అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలు ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘బీ’ గ్రేడ్‌కు చేరారు. ఫామ్‌లో లేకపోవడం వల్ల వీరిద్దరూ శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌లోనూ స్థానం కోల్పోయారు. మరో స్టార్ ఆటగాడు, ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా కూడా ‘ఏ’ గ్రేడ్‌లో స్థానం కోల్పోయాడు. గాయాలతో బాధపడుతున్న హార్థిక్ ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘సీ’ గ్రేడ్‌కు…
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో టీమిండియా యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ అదరగొట్టాడు. ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‌లో వీర విహారం చేసిన అతడు ఏకంగా 27 ర్యాంకులు మెరుగై 18వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ టాప్-10 నుంచి పడిపోయాడు. దీంతో కోహ్లీ 15వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. మరోవైపు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు ర్యాంకులు తగ్గి 13వ ర్యాంకులో ఉన్నాడు. గాయంతో జట్టుకు దూరమైన కేఎల్ ఒక ర్యాంకు తగ్గి…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుపై కన్నేశాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో టీమిండియా ఆడబోతున్న తొలి టెస్టు విరాట్ కోహ్లీకి 100వ టెస్టు. కెరీర్లో వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఈ టెస్టులో మరో 38 పరుగులు చేస్తే టెస్టుల్లో 8వేల పరుగులు పూర్తి చేసిన ఆరో భారత ఆటగాడిగా అవతరిస్తాడు. గతంలో భారత్ తరఫున సచిన్ (15,921), ద్రవిడ్ (13,288), గవాస్కర్ (10,122), సెహ్వాగ్ (8,586), లక్ష్మణ్ (8,781) మాత్రమే…
శ్రీలంకతో మార్చి 4 నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టు టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. దానికి కారణం ఆ మ్యాచ్ ద్వారా కోహ్లీ టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడనున్నాడు. టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడటం ఏంటే ఎంతో ప్రత్యేకం. దిగ్గజ ప్లేయర్లకు సైతం టెస్టుల్లో 100 మ్యాచ్ ఆడటం సాధ్యం అయ్యే పని కాదు. అయితే శ్రీలంకతో జరిగే ఈ టెస్టు ద్వారా కోహ్లీ ఈ ఘనతను అందుకోనున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్…
టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్‌లో ఉన్నాడు. గత రెండేళ్లుగా అతడి కెరీర్లో సెంచరీ అనేది లేదు. అయినా అతడు కెప్టెన్ కాబట్టి ఇన్నాళ్లూ జట్టులో కొనసాగుతూ వచ్చాడు. ఇప్పుడు కెప్టెన్సీ కూడా పోయింది. కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత కోహ్లీ బ్యాటింగ్‌లో మార్పు వస్తుందని చాలా మంది ఆశించారు. కానీ అతడి బ్యాటింగ్‌లో మునుపటి వాడి, వేడి లేవనే విషయం మాత్రం అర్థమవుతోంది. అడపాదడపా కష్టపడి హాఫ్ సెంచరీలు కొడుతున్నా అవి సాధికారిక…
టీమిండియాకు అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా పక్కకు తప్పుకున్నా విరాట్ కోహ్లీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. 2022 జనవరి నెలకు సంబంధించి భారత్‌లో పాపులర్ ఆటగాడిగా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ మేరకు ఓర్మాక్స్ మీడియా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కోహ్లీ తొలి స్థానంలో ఉండగా.. మాజీ ఆటగాడు ధోనీ రెండో స్థానంలో ఉండటం విశేషం. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. వన్డేల్లో టీమిండియా తరపున అత్యధిక…
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నిన్న వెస్టిండీస్‌తో టీమిండియా తలపడిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో భారత్ 8 పరుగుల తేడాతో వెస్టిండీస్ పై విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ముందుగా వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వెస్టిండీస్ జట్టుకు చివరి 12 బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా, భువనేశ్వర్…
టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య కోల్‌కతా వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించడానికి చేరువలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఈరోజు జరిగే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ పేరు మీద…
ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకులను ప్రకటించింది. టీమ్ ర్యాంకుల్లో ఇంగ్లండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక తదుపరి స్థానాల్లో ఉన్నాయి. అటు బౌలర్ల ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ షాంసీ అగ్రస్థానంలో ఉండగా… ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ రెండో స్థానానికి దూసుకెళ్లాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో మెరుగ్గా రాణించడంతో అతడు నాలుగు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. టాప్-10 బౌలర్లలో టీమిండియా నుంచి ఒక్కరు కూడా లేరు. ఇక బ్యాటింగ్ ర్యాంకుల్లో పాకిస్థాన్…
సారథిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి వన్డే సిరీస్‌లోనే రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌లో వన్డేల్లో విండీస్‌ను వైట్‌వాష్ చేసిన మొట్టమొదటి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. తన తొలి వన్డే సిరీస్‌నే క్లీన్‌స్వీప్ చేయడమే కాకుండా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డును అధిగమించాడు. రోహిత్ ఇప్పటివరకు 13 వన్డేలకు కెప్టెన్సీ వహించగా 11 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. దీంతో ఇండియా తరఫున కోహ్లీ నెలకొల్పిన…